కేరళం సీఎం Vs తెలంగాణ సీఎం.. విజయన్‌కు కేసీఆర్ ఫ్రెండ్, మోదీ గాడ్ ఫాదర్: రేవంత్ రెడ్డి

Wait 5 sec.

కేరళం ఎన్నికల ప్రచారంలో మరోసారి పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేరళం ప్రజలను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో తాను చర్చకు రెడీగా ఉన్నట్లు సీఎం పినరయి విజయన్‌కు.. రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా పినరయి విజయన్‌పై పలు కేసుల్లో సంచలన ఆరోపణలు ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పవిత్ర శబరిమల అయ్యప్ప దేవస్థానం బంగారం మాయం కేసుతోపాటు.. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విజయన్ పేరు ఉందని తెలిపారు. అదే సమయంలో పినరయి విజయన్‌‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంది సంబంధాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేరళం ముఖ్యమంత్రిని పలు కేసు నుంచి ప్రధాని మోదీ కాపాడుతున్నారని తెలిపారు. ప్రధాని మోదీ నుంచి కేరళం సీఎం సూచనలు తీసుకుంటున్నారని.. వారి మధ్య రహస్య ఒప్పందం ఉందని రేవంత్ ఆరోపణలు చేశారు. పినరయి విజయన్‌కు ప్రధాని మోదీ గాడ్ ఫాదర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేరళం యువతను విజయన్‌ మోసం చేస్తున్నారని.. ఆ రాష్ట్ర ప్రజల నుంచి తనకు ఫీడ్‌బ్యాక్‌ వచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక పినరయి విజయన్‌కు కేసీఆర్‌ మంచి మిత్రుడు అని.. కేసీఆర్‌ పాలన గురించి కేరళం సీఎం గతంలో ప్రస్తావించారని గుర్తు చేశారు.ఈ సందర్భంగా కేరళం ప్రజలపై రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. కేరళం యూత్ కష్టపడే తత్వం గలవారని కొనియాడారు. గల్ఫ్ దేశాల అభివృద్ధిలో కేరళం యువత కృషి ఎనలేనిదన్నారు. కేరళంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) సర్కార్‌కు ముగిసిందని.. ఇక పినరయి విజయన్ ప్రభుత్వం పదవి అయిపోయిందని జోస్యం చెప్పారు. కేరళంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేరళ అభివృద్ధిలో కరరుణాకరణ్, ఊమెన్ చాందీ పాత్ర ఉందని.. కానీ పినరయి విజయన్ మాత్రం తానే అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటున్నారని తెలిపారు.తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను గద్దె దించినట్లే.. కేరళంలో పినరయి విజయన్‌ను కూడా ఇంటికి పంపిస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. 2023కు ముందు కూడా తెలంగాణను తాను తప్ప ఎవరు నడిపించలేరని పిన‌ర‌యి విజ‌య‌న్ ఫ్రెండ్ కేసీఆర్ అనుకున్నారని.. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. కేరళంలో యూడీఎఫ్ కూటమి వచ్చి పిన‌ర‌యి విజ‌య‌న్ అధికార కోటను ‌బద్దలు కొడుతుందని తెలిపారు. పిన‌ర‌యి విజ‌య‌న్ పేరుతో‌ ప్రధాని మోదీ కేరళంలోకి ప్రవేశిస్తున్నారని పేర్కొన్నారు. మోదీ, పినరయి విజయన్ ఇద్దరూ బ్రదర్స్ అని.. కేరళ‌ంలో పిన‌ర‌యి, ఢిల్లీలో మోదీ మంచి మిత్రులని తెలిపారు.