22k Gold Rate Today: భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు పండగలు, శుభకార్యాలు సహా ఇతర వేడుకల వేళ బంగారు ఆభరణాల్ని ఎక్కువగా కొనుగోలు చేసి ధరిస్తుంటారు. బంగారం వినియోగించే దేశాల్లో భారత్.. చైనాతో కలిసి ముందు వరుసలో ఉంటుంది. ఇంకా ఎక్కువగా భారత్ బంగారం విషయంలో.. దిగుమతులపైనే ఆధారపడుతుంది. స్విట్జర్లాండ్ నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకుంటుంది. గతేడాది పసిడి ధరలు విపరీతంగా పెరిగిన క్రమంలో కొనుగోలు శక్తి కాస్త తగ్గిన మాట వాస్తవమే. అయితే.. . దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు ఆర్బీఐ కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటుంది. ఆర్బీఐ దగ్గర ప్రస్తుతం సుమారు 880 టన్నుల వరకు బంగారం నిల్వలు ఉన్నాయి.బంగారం ధరల విషయానికి వస్తే.. గతేడాది గోల్డ్ రేట్లు 70 శాతం వరకు పెరగ్గా.. ఈ ఏడాది కూడా ఆరంభంలో బాగానే పెరిగాయి. కానీ మళ్లీ అమెరికా- ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో మార్చి సమయంలో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరగ్గా.. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించని క్రమంలో.. డాలర్ పుంజుకోగా.. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇక మళ్లీ యుద్ధం ముగింపుపై సంకేతాలతో ఇటీవల వరుసగా మళ్లీ పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఏప్రిల్ 11న ఉదయం 7.30 గంటల సమయంలో చూస్తే గోల్డ్ రేట్లు కిందటి రోజుతో చూస్తే స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 800 పెరిగి తులం రూ. 1,39,650 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల మేలిమి రూ. 870 పెరిగి 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,52350 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు ఇలా ఉంటే వెండి రేట్లు కూడా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఒక్కరోజే రూ. 5 వేలు పెరగ్గా కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ. 2.65 లక్షలుగా ఉంది. ఇది ముందటి రోజు రూ. 5 వేలు తగ్గుముఖం పట్టింది. దేశీయంగా ధరలు పెరిగినా అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ముందటి రోజుతో చూస్తే తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4750 డాలర్ల దిగువకు చేరింది. అంతకుముందు 4800 డాలర్ల స్థాయిలో ఉండేది. సిల్వర్ రేటు కూడా 77 డాలర్ల నుంచి 75 డాలర్లకు దిగొచ్చింది. దీనికి అనుగుణంగా ఉదయం 10 గంటల తర్వాత దేశీయంగా బంగారం, వెండి ధరలు దిగొచ్చే అవకాశాలు ఉన్నాయి.