అమెరికా, ఇరాన్‌ల మధ్య అస్థిరమైన కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ కలిగించవచ్చని ప్రముఖ విశ్లేషకుడు, యూరేషియా గ్రూప్ వ్యవస్థపాకుడు ఇయాన్ బ్రెమ్మర్ అభిప్రాయపడ్డారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బ్రేమ్మర్ మాట్లాడుతూ.. తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ రగిలిపోతున్నారని, ఆ క్రమంలో తన పరిధిని మించి నిర్ణయాలు తీసుకోవడం కూడా చర్చల ఆటంకానికి ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. అవకాశం దొరికితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఖమేనీ ‘క్షణంలో’ హతమారుస్తారని ఆయన అన్నారు.సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో కాల్పుల విరమణ కొనసాగే అవకాశం, ట్రంప్ ముందున్న ప్రత్యామ్నాయాలు, ముఖ్యంగా యుద్ధం ముగించడంతో పాకిస్థాన్‌కు ఘనత దక్కుతున్న నేపథ్యంలో భారత్ మరింత కీలక దౌత్య పాత్ర పోషించి ఉండొచ్చా? అనే విషయాల గురించి కూడా బ్రెమ్మర్ మాట్లాడారు. ఇస్లామాబాద్‌లో జరగబోయే చర్చలను ఒక సానుకూల పరిణామంగా అభివర్ణిస్తూ.. పూర్తిగా తెరుచుకోలేదని, 24 గంటల్లో కేవలం ఏడు నౌకలు మాత్రమే ప్రయాణించాయని, అది కూడా ఇరాన్ అనుమతితోనే జరిగిందని రిస్క్ అనలిస్ట్ పేర్కొన్నారు.చర్చలకు ఆటంకం కలిగించే సవాళ్లుఇరాన్, అమెరికా మధ్య చర్చలకు ఆటంకం కలిగించే సాంకేతిక, అంతర్గత సవాళ్లను ఈ సందర్భంగా చర్చించారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్దిచేసిన యురేనియం మొత్తం అప్పగించాలని, లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీల వంటి ఫ్రాక్సీలకు టెహ్రాన్ మద్దతు నిలిపివేయాలని అమెరికా పట్టుబట్టడం వల్ల కాల్పుల విరమణకు ఆటంకం కలగవచ్చని ఆయన వివరించారు. ‘‘మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇరాన్ తన సొంత సైనిక నిర్ణయాలపై ఎంతవరకు పూర్తి నియంత్రణ ఉంది అనే ప్రశ్న తలెత్తుతుంది.. యుద్ధం తొలినాళ్లలో సైనిక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని స్థానిక కమాండర్లకు వికేంద్రీకరించారు.. శత్రువులను భయపెట్టడానికి, నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది.. కానీ, కాల్పుల విరమణ ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటే ఇది మరింత సమస్యాత్మకంగా మారుతుంది. ఎందుకంటే కొంతమంది స్థానిక కమాండర్లు ఒప్పందంతో ఏకీభవించకుండా సొంత నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది’’ అని బ్రెమ్మర్ అన్నారు.అంతేకాకుండా శక్తివంతమైన ఇరాన్ ఎలైట్ గ్రూప్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒప్పందానికి ఏమేరకు అంగీకరిస్తుందనేది ప్రశ్నార్థకమే అని వ్యాఖ్యానించారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి ఉన్నప్పటికీ గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా తన దళాల మోహరింపు కొనసాగిస్తోందని, మరో విమాన వాహక నౌకను అక్కడకు తరలిస్తోందని ఆయన గుర్తుచేశారు.మోజ్తాబా ప్రతీకారంఇరాన్ తన పరిధిని మించి వ్యవహరించే అవకాశం ఉందా? అంటే అవుననే సమాధానం ఇచ్చారు. తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ సహా కుటుంబసభ్యులు అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో మరణించడంతో సుప్రీం లీడర్ పదవి చేపట్టారని తెలిపారు. కేవలం రాజకీయ లాభనష్టాల కోసం మోజ్తాబా ఆలోచిస్తున్నారని తాను భావించడం లేదని చెప్పారు. ఆయన ప్రతీకార దాహంతో ఉన్నారని, ఒకవేళ ట్రంప్‌ను ఎలా హతమార్చాలో తెలిస్తే క్షణంలోనే ఆ పనిచేస్తారన్నారు. కాబట్టి ప్రతీకార వాంఛ అతడ్ని నడిపిస్తుందని, అమెరికన్లపై పగ తీర్చుకోవాలనేది ఆయన ప్రధాన ధ్యేయం కావచ్చన్నారు. అంతేకాదు, యుద్ధంలో జరిగిన అతిపెద్ద నష్టం భవిష్యత్తులో హేతుబద్దమైన నిర్ణయాలను తీసుకోలేనంతగా ఇరాన్‌కు అమెరికా అణచివేసిందని అన్నారు.