ఒరేయ్ బుడ్డోడా ఆ బాదుడేంది.. ఆర్సీబీ బౌలర్లకు నరకం చూపెట్టిన వైభవ్ సూర్యవంశీ!

Wait 5 sec.

ఐపీఎల్ సెన్సేషనల్ మరోసారి తన విశ్వరూపం చూయించాడు. పదిహేనేళ్ల వయస్సులో సంచలనాలు సృష్టిస్తోన్న ఈ బుడ్డోడు ఐపీఎల్ 2026లో ఆర్సీబీ బౌలర్లకు నరకం చూపెట్టాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో ఈ సీజన్‌లో అడుగుపెట్టిన ఆర్సీబీ వైభవ్ దెబ్బకు ఓటమిపాలయింది. వరల్డ్ టాప్ బౌలర్లు బౌలింగ్ చేస్తున్నా ఎలాంటి బెరుకు లేకుండా స్టాండింగ్ సిక్సర్లతో ఏసీఏ స్టేడియంలో రీ సౌండ్ తెప్పించాడు. గువాహటి వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి రెచ్చిపోయాడు. ఆర్సీబీ అందించిన 202 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు వైభవ్ అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తోన్న రాజస్థాన్ ఓపెనర్లు మరోసారి శుభారంభం అందించారు. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన యశస్వి జైస్వాల్ 8 బంతుల్లో రెండు సిక్సర్లు బాది జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో దొరికిపోయాడు. 13 పరుగులు చేసి జైస్వాల్ అవుటవ్వడంతో.. రాజస్థాన్ 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జైస్వాల్ అవుటైన తర్వాత వైభవ్ తనదైన శైలిలో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ టాప్ స్వింగర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఒక ఓవర్‌లో రెండు బౌండరీలు బాదిన వైభవ్, ఆ తర్వాత వరుసగా రెండు సిక్సర్లు కొట్టి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. పవర్ ప్లే ముందు వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లతో పాటు ఆఖరి బంతికి బౌండరీ బాదాడు. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అయితే విధ్వంసమే సృష్టించాడు. వరుసగా మూడు బౌండరీలతో పాటు, ఒక సిక్సర్ బాది 19 పరుగులు రాబట్టాడు. వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్ అయిన హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో కూడా వైభవ్ ఈ రేంజ్‌లో ఆడటంతో ఆర్సీబీ టీమ్ స్టన్ అయింది. వైభవ్ విధ్వంసానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు పవర్ ప్లేలోనే 97 పరుగులు రాబట్టి విజయాన్ని ఖరారు చేసుకుంది. ఐపీఎల్‌ 2025లో గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీ నమోదు చేసిన వైభవ్, ఈ ఏడాది ఆర్సీబీపై సెంచరీ చేస్తారని అందరూ అనుకున్నారు. కేవలం 26 బంతులే ఆడిన వైభవ్ ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లతో 78 పరుగులు చేసి కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో అవుటయ్యాడు. బౌండరీ లైన్ దగ్గర విరాట్ కోహ్లి అద్భుతమైన క్యాచ్ పట్టి వైభవ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ధృవ్ జురేల్ 43 బంతుల్లో 81, జడేజా 25 బంతుల్లో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచి 18 ఓవర్లలో మ్యాచ్‌ని ముగించారు. ఈ విజయంతో రాజస్థాన్ వరుసగా నాలుగు విజయాలతో పాయింట్స్ టేబుల్ టాప్ ప్లేస్‌లో నిలిచింది.