ఐపీఎల్‌లో ఇవాళ మధ్యాహ్నం పరుగుల వరద పారే ఓ మ్యాచ్ ప్రేక్షకులను ఊరిస్తోంది. పంజాబ్ కింగ్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు రసవత్తర మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లైవ్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఐపీఎల్ 2025 రన్నరప్, ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు ఓటమి లేకుండా ముందుకు వెళ్తున్న పంజాబ్‌ను మాత్రం సన్‌రైజర్స్ భయపెడుతోంది. దానికి ఇరు జట్ల మధ్య పాత రికార్డులే కారణం. ఏ జట్టు మీద ఎలా ఆడినా సన్‌రైజర్స్‌తో మ్యాచ్ అనేసరికి పంజాబ్‌లో కాస్తంత టెన్షన్ మొదలవుతుంది. గతేడాది ఇదే పంజాబ్‌పై అదిరిపోయే సెంచరీ చేయడమే కాకుండా, సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కి ఆ శతకాన్ని అంకితం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్‌పై సన్‌రైజర్స్ మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఆఖరి ఐదు మ్యాచ్‌లలో పంజాబ్ ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేదు. 2025లో ఉప్పల్‌లో జరిగిన ఏకైక మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెడ్ వన్ సైడ్‌గా గెలిచింది. 2024లో రెండు, 2023లో ఒకటి, 2022లో మాత్రం ఒకటి గెలిచి, ఒకటి ఓడింది. ఓవరాల్‌గా 24 మ్యాచ్‌లు జరిగితే సన్‌రైజర్స్ ఏకంగా 17 మ్యాచ్‌లలో విజయం సాధించింది. పంజాబ్ కేవలం ఏడంటే ఏడు మ్యాచ్‌లలోనే గెలిచింది. పంజాబ్‌తో జరిగిన ఆఖరి రెండు మ్యాచ్‌లలో కూడా సన్‌రైజర్స్ 200కు పైగా స్కోర్‌ను ఛేజ్ చేసింది. రెండు మ్యాచ్‌లలో కూడా అభిషేక్ శర్మనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 2024లో 28 బంతుల్లో 66 పరుగులు చేయగా.. 2025లో 55 బంతుల్లోనే 141 పరుగులు చేసి హడల్ పుట్టించాడు. దాంతో ఈ రోజు జరిగే మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మనే ఫేవరెట్‌గా నిలవనున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టు అంచనాప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), కూపర్ కాన్‌లీ, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినీస్, మార్కో యాన్సన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనాట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఈషాన్ మలింగ / బ్రైడన్ కార్స్.