IPL 2026: ఇవాళ డబుల్ హెడర్‌లో దుమ్ము దులిపే మ్యాచ్‌లు.. సన్‌రైజర్స్, సీఎస్కే ఫ్యాన్స్‌కి ఫుల్ మస్తీ!

Wait 5 sec.

వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ట్ అయింది. ఈ వీకెండ్ శనివారం రోజున సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కి ఫుల్ మస్తీ ఇచ్చే మ్యాచ్‌లు ఉన్నాయి. విజయం కోసం సీఎస్కే ఎదురుచూస్తుండగా.. మరో గ్రాండ్ విక్టరీ కోసం సన్‌రైజర్స్ చూస్తోంది. ఈ రెండు మ్యాచ్‌లతో ఫ్యాన్స్‌కు ఇవాళ ఐపీఎల్ కిక్కు అందడం ఖాయమని చెప్పొచ్చు.ఐపీఎల్ 2026లో భాగంగా ఈ రోజు డబుల్ హెడర్స్ జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు మధ్య మ్యాచ్‌ జరగనుండగా.. రాత్రి 7:30 గంటలకు మధ్య పోరు జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లతో ఫ్యాన్స్ మధ్యాహ్నం నుంచే టీవీలకు అంకితం కాడం ఖాయం. ఐపీఎల్ 2025 రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ ఏడాది కూడా అదే జోష్‌‌లో ఉండగా.. సన్‌రైజర్స్ మాత్రం పడుతూ లేస్తూ ముందుకు వెళ్తోంది. పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్‌లు ఆడితే అందులో రెండు విజయాలు సాధించగా, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అంటే ఈ సీజన్‌లో పంజాబ్‌కి ఇప్పటి వరకు ఓటమే లేదు. ఇక సన్‌రైజర్స్ కూడా మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్కటే గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరో స్థానంలో ఉంది. దాంతో పంజాబ్‌ని ఓడించి పాయింట్లు మెరుగుపరుచుకోవాలని సన్‌రైజర్స్ చూస్తోంది. ముల్లాన్‌పూర్ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.ఐపీఎల్ 2024 నుంచి మొదలైన సీఎస్కే డౌన్‌ఫాల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్2025లో అట్టడుగు స్థానానికి పడిపోయిన చెన్నై.. ఈ ఏడాది కూడా అక్కడ నుంచే మొదలెట్టింది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడితే ఒక్కటి కూడా గెలవలేదు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెపాక్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో అయినా గెలిచి తొలి విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ రెండు మ్యాచ్‌ల లైవ్‌లు స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.