సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌లో హైడ్రా చేపట్టిన ఆపరేషన్‌కు కూల్చివేతలపై బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో నిలిపివేయాలని స్టే విధించింది. దీంతో హైడ్రా కూల్చివేతలను నిలిపివేసింది. ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా ముందుకు సాగుతోంది. తాజాగా, సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం చేపట్టింది. పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో ఈ ఆపరేషన్‌ను హైడ్రా నిర్వహిస్తోంది. కోర్టు స్టే విధించినా.. ఓ గెస్ట్ హౌస్‌తో పాటు, ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించడంతో దానిని హైడ్రా కూల్చివేస్తోంది. ఐలాపూర్‌లో మొత్తం 1,263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. చాలా మంది ఆ స్థలంలో ఇళ్లు కట్టుకున్నారు. వాటికి జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడేందుకు రంగంలోకి దిగింది. 863 ఎకరాల భూమి ఉండగా.. వాటి విలువ రూ.15 వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా. 1998 నుంచి కోర్టు ఉత్తర్వులు కొనసాగుతున్నా వాటిని పట్టించుకోకుండా గెస్ట్‌హౌస్‌, ఎలాంటి అనుమతులు లేకుండా 6 అంతస్తుల భవనం నిర్మించారు. తాజాగా, వాటిని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రిస్టల్ డెవలపర్స్ నిర్మించిన అపార్ట్‌మెంట్‌ ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు అధికారులు నిర్ధారించారు. అపార్ట్‌మెంట్‌లోని నివాసాలను ముందుగా ఖాళీచేయించిన అధికారులు.. బుల్డోజర్లతో కూల్చివేత పనులు ప్రారంభించారు.అయితే, దీనిని స్థానికులు, అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసివారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు, హైడ్రా సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుని, పోలీసులను భారీగా మోహరించారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతుండగా... హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో నిలిచిపోయాయి.