RR vs MI: వర్షంతో తడిసిన గువాహటి స్టేడియం.. రాజస్థాన్-ముంబై మ్యాచ్ రద్దు?

Wait 5 sec.

ఐపీఎల్ 2026లో భాగంగా ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. సాయంత్రం నుంచే గువాహటిని మేఘాలు కమ్మేయడం, ఆ తర్వాత వర్షం పడటంతో మ్యాచ్ నిర్వహణపై సందేహాలు మొదలయ్యాయి. కేకేఆర్ - పంజాబ్ మ్యాచ్ ఇప్పటికే వర్షంతో రద్దవగా.. ఇప్పుడు రాజస్థాన్ - ముంబై మ్యాచ్‌కీ అదే పరిస్థితి వచ్చేలా ఉంది. ఐపీఎల్ 2026 13వ మ్యాచ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ - ముంబై ఇండియన్స్ జట్లు గువాహటి వేదికగా మ్యాచ్‌కి సిద్ధమయ్యాయి. మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం అవుతుందనగా.. గువాహటిని వర్షం ముంచెత్తింది. సాయంత్రం వేళ నగరాన్ని మేఘాలు కమ్మేసి, వర్షం పడటంతో ఎక్కడ చూసినా నీళ్లే నిలిచిపోయాయి. వర్షం ప్రభావం ఉండటంతో స్టేడియాన్ని సిబ్బంది కవర్స్‌తో నింపేశారు. పిచ్ మొత్తాన్ని కప్పేసిన సిబ్బంది కొంత వరకు సక్సెస్ అయినా.. అవుట్ ఫీల్డ్ మొత్తం నీళ్లతో నిండిపోయింది. పూర్తి స్థాయిలో కాకపోయినా అవుట్ ఫీల్డ్‌లో నీళ్లు నిలబడటంతో మ్యాచ్ నిర్వహణపై సందేహాలు మొదలయ్యాయి. దాంతో పాటు ఇంకా మేఘాలు ఉండటంతో ఒకవేళ మ్యాచ్ స్టార్ట్ అయినా, మళ్లీ ఈ వర్షం మధ్యలో అంతరాయం కలిగించే అవకాశం ఉండొచ్చని మ్యాచ్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ మంచి జోష్‌లో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌ని ఇదే వేదికపై చిత్తుగా ఓడించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు, రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ఇన్నేళ్ల ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా మొదటి మ్యాచ్ గెలవని ఎంఐ.. తొలిసారి కేకేఆర్‌పై భారీ స్కోర్ ఛేజ్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. రెండో మ్యాచ్‌లో ఢిల్లీపై ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ ఐదో స్థానంలో కొనసాగుతోంది.