అవుటవ్వగానే బ్యాట్ గిరాటేసి, హెల్మెట్ విసిరేసిన ట్రిస్టన్ స్టబ్స్.. సీఎస్కే మ్యాచ్‌లో హీటెడ్ మూమెంట్ !

Wait 5 sec.

చెపాక్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో కొంచెం హీటెడ్ మూమెంట్ నెలకొంది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఆఖరి మూడు ఓవర్లలో మ్యాచ్ చాలా టఫ్‌గా మారింది. అదే సమయంలో క్రీజులో ఉండటం 18వ ఓవర్‌లో పరుగులు రాబట్టడంతో.. ఎవరు విజయం సాధిస్తారు అనేది చాలా ఉత్కంఠగా మారింది. 19వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన జెమీ ఓవర్టన్ తన అనుభవాన్ని అంతా ఉపయోగించి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలోనే ట్రిస్టన్ స్టబ్స్ స్ట్రయిట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి సర్కిల్ లోపలే దొరికిపోయాడు. దాంతో స్టబ్స్ బౌండరీ లైన్ దాటంగానే బ్యాట్‌ని గిరాటేసి, డ్రస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన తర్వాత హెల్మెట్ తీసి నేలకేసి కొట్టాడు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, అసలు విషయం ఏంటంటే 18వ ఓవర్ జరుగుతున్న సమయంలోనే ట్రిస్టన్ స్టబ్స్ తన గ్లౌజ్‌లు ఛేంజ్ చేసుకోవాలంటూ ఢిల్లీ డగౌట్స్ వైపు చూయిస్తూ చెప్పాడు. నితీష్ రాణా, కరుణ్ నాయర్ గ్లౌజ్‌లతో రెడీగా కూడా ఉన్నారు. అంపైర్ మాత్రం గ్లౌజ్‌లు ఛేంజ్ చేసుకోవడానికి అనుమతించలేదు. అప్పటికే చెమటతో నిండిపోవడంతో సరైన షాట్స్ తగలకపోగా.. బ్యాట్ కూడా జారిపోతుంది. కానీ, అంపైర్ మాత్రం ఓవర్ల మధ్యలో ఛేంజ్ చేసుకోవడానికి అనుమతించలేదు. 18 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అంటే విజయానికి 32 పరుగులు కావాల్సి ఉంది. ఆఖరి రెండు ఓవర్లు స్ట్రయికింగ్ స్టబ్స్.. మ్యాచ్ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్న సమయంలో అంపైర్ చేసిన పని కారణంగా షాట్‌కి ప్రయత్నించిన ఢిల్లీ బ్యాటర్ స్టబ్స్ అనవసరంగా వికెట్ కోల్పోయాడు. ఆ కోపంతోనే బ్యాట్ విసిరేసి, హెల్మెట్‌ని నేలకేసి కొట్టేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ 38 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 60 పరుగులు చేసి అవుటయ్యాడు. ఒకవేళ అంపైర్ గ్లౌజ్‌లు ఛేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చుంటే ఫలితం మరోలా ఉండేదేమో! అయితే, మొత్తానికి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్ 2026లో ఖాతా ఓపెన్ చేసింది. సంజూ శాంసన్ సెంచరీతో పాటు, జెమీ ఓవర్టన్ అద్భుత బౌలింగ్‌తో సీఎస్కే విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 212/2 పరుగులు చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 189 పరుగులకు ఆలౌట్ అయింది.