Gold Rate Today: భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. బంగారు ఆభరణాలు ధరించే సంప్రదాయం వందల సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తోంది. అలాగే పెళ్లిళ్లు, పండగల వంటి శుభకార్యాల సమయంలో బంగారం కచ్చితంగా ఉండాల్సిందే అంటారు. ఇటీవలి కాలంలో మహిళలతో పాటు పురుషులూ బంగారం ధరిస్తున్నారు. అంతే కాదు ప్రస్తుత రోజుల్లో బంగారం ఒక పెట్టుబడి మార్గంగానూ మారిపోయింది. అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థిక భరోసా కల్పిస్తుందని నమ్ముతారు. అయితే, గత కొద్ది కాలంగా బంగారం ధరల్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం నెలకొన్నయుద్ధం మొదలైన కొద్ది రోజుల తర్వాత బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. ఆ తర్వాత మళ్లీ భారీగా పెరిగాయి. అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ ప్రకటన వచ్చిన రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. అయితే, ఆ తర్వాత మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. సీజ్ ఫైర్ పై రోజుకో ప్రకటన రావడంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మళ్లుతున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 12వ తేదీన బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో తగ్గిన ధరలుఅంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 44 డాలర్ల మేర తగ్గింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 4748 డాలర్ల వద్దకు దిగివచ్చింది ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.33 శాతం మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం సిల్వర్ రేటు ఔన్సుకు 76 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలుఈరోజు 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.490 మేర పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ. 1,52,840 వద్దకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు ఈరోజు 10 గ్రాములపై రూ.450 మేర పెరిగింది. దీంతో తులం ధర రూ. 1,40,100 వద్దకు చేరుకుంది. స్థిరంగా వెండి ధరబంగారం ధరలు వరుసగా పెరుగుతున్నప్పటికీ వెండి మాత్రం స్వల్ప ఊరట కల్పించింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం కిలో వెండి రేటు ఏ మార్పు లేకుండా రూ. 2,65,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అయితే బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మధ్యాహ్నం లోపు మారిపోతుంటాయి. కొనుగోలుదారులు స్థానిక రేట్లను తెలుసుకోవడం మంచిది.