Payments: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) యాప్స్ ఉపయోగిస్తున్నారు. కిరాణా సామన్లు, కూరగాయల దగ్గర నుంచి ఎలక్ట్రానికి వస్తువుల కొనుగోళ్ల వరకు యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు. ఇప్పుడు నగదు తీసుకెళ్లడం భారీగా తగ్గింది. ఎక్కడైనా ఎంత చిన్న అమౌంట్ అయినా యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు. యూపీఐ చెల్లింపులు సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో ప్రజల చిల్లర సమస్యకు ఓ పరిష్కారం దొరికింది. నగదు కోసం ఏటీఎంల వద్ద బారులు తీరడమూ కనుమరుగైంది. 2016, ఏప్రిల్ 11వ తేదీన యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి దిన దిన అభివృద్ధి చెందుతూ లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లు నిర్వహించే స్థాయికి చేరుకుంది. గత మార్చి, 2026 నెలలో యూపీఐ ద్వారా ఏకంగా రూ.30 లక్షల కోట్ల మేర లావాదేవీలు నిర్వహించడమే అందుకు నిదర్శనం. గడిచిన 10 సంవత్సరాల కాలంలో ప్రజల రోజువారీ జీవనంలో యూపీఐ ఒక భాగంగా మారిపోయింది. డిజిటల్ పేమెంట్లలో యూపీఐ ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. వర్చువల్ పేమెంట్ అడ్రస్ ద్వారా బ్యాంక్ అకౌంట్ తో లింక్ చేయడం ద్వారా ట్రాన్సాక్షన్లు ఈజీగా మారిపోయాయి. ఎవరికైనా డబ్బు పంపించాలన్నా, వారి బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ లేకుండానే చెల్లించే వీలు కలిగింది. లేదా పొందడం జరుగుతోంది. రోజులో ఏ టైంలో అయినా రియల్ టైమ్ లో ఎలాంటి ఆటంకాలు లేకుండా డబ్బులు పంపించే వెసులుబాటు ఉంది. దీంతో ఎక్కువ మంది యూపీఐ పేమెంట్లకే మొగ్గు చూపిస్తున్నారు. చిన్న మొత్తాల పేమెంట్ల కోసం యూపీఐ లైట్ వంటి ఫీచర్లనూ తీసుకొచ్చారు. క్రమం తప్పకుండా చేసే ట్రాన్సాక్షన్ల కోసం యూపీఐ ఆటో పే, ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ వంటి వాటి కోసం క్రెడిట్ ఆన్ యూపీఐ వంటి సదుపాయాలూ ఉన్నాయి. యూపీఐకి బలమైన సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఉంటుది. ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే ప్రత్యేక యంత్రాంగం ఉంటుంది. ఈ కొత్త తరం వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు 2026, 2- ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది. సైబర్ మోసాలను తగ్గించి డిజిటల్ ట్రాన్సాక్షన్లపై నమ్మకం కలిగించేందుకు పిన్, బయోమెట్రిక్స్, ఓటీపీలతో పాటు సెక్యూర్ టోకెన్స్ వంటి లేయర్లు ఇందులో ఉన్నాయి. 2026, ఏప్రిల్ 11వ తేదీన యూపీఐ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. 2016 ఆగస్టులో ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ వచ్చాయి. 2016, డిసెంబర్ నెలలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భీమ్ యూపీఐ యాప్ తీసుకొచ్చింది. 2017 సెప్టెంబర్ లో తేజ్ యాప్ రాగా అదే తర్వాత గూగుల్ పేగా మారింది. 2018 ఆగస్టులో యూపీఐ 2.0 ప్రారంభమవగా డిసెంబర్ లో నెలవారీ ట్రాన్సాక్షన్ల విలువ తొలిసారి రూ.1 లక్ష కోట్లకు చేరింది. 2020, అక్టోబర్ నాటికి 100 కోట్లకు ట్రాన్సాక్షన్లు చేరాయి.2022 సెప్టెంబర్ నెలలో యూపీఐకి రూపే క్రెడిట్ కార్డును లింక్ చేసుకునే అవకాశం ఇచ్చారు. యూపీఐ లైట్ వచ్చింది. 2023 ఫిబ్రవరిలో సింగపూర్ లో తొలిసారి యూపీఐ ప్రారంభించారు. 2023 సెప్టెంబర్ నెలలో ఏటీఎం నుంచి నగదు తీసుకునే సౌకర్యం వచ్చింది. 2026, మార్చి నాటికి నెలవారీ లావాదేవీల విలువ రూ.30 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం.