భారత ప్రజల దగ్గర రూ. 465 లక్షల కోట్ల విలువైన బంగారం.. వరల్డ్ టాప్- 10 బ్యాంకులకు మించి..!

Wait 5 sec.

: మన దేశంలో పసిడికి ఫుల్ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయంలో మహిళలు బంగారు ఆభరణాల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇంకా భారతీయుల ఇళ్లలో దాదాపు ప్రతి ఇంట్లోనూ ఎంతో కొంత బంగారం ఉంటుంది. వీలు చిక్కినప్పుడల్లా తమ స్థోమతకు తగ్గట్లుగా గోల్డ్ జువెల్లరీ కొనుగోలు చేస్తుంటారు. ఇంకా ఆడపిల్ల పెళ్లి సమయంలోనూ ఎంతో కొంత బంగారం పెడుతుంటారు. ఇలా ఇళ్లలో పోగుబడిన బంగారం ఎంతో ఉంటుంది. ఇటీవల . ఇక మన దేశంలోని గృహస్థుల దగ్గర లోహం రూపంలో ఉన్న పసిడి.. ప్రపంచంలోనే అత్యధికం అని పరిశ్రమల సంఘం అసోచామ్ పేర్కొంది. దీంట్లో కొంత మొత్తమైనా.. ఆర్థిక కార్యకలాపాలకు వినియోగిస్తే 2047 కల్లా ఇంకా భారత జీడీపీకి లక్షల కోట్ల డాలర్ల మేర యాడ్ అవుతుందని తెలిపింది. ఇది తయారీ, వ్యవసాయ రంగాలు, మౌలిక వసతుల్ని మరింత బలోపేతం చేసేందుకు.. వినియోగం పెంచి ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు.. ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుందని వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం సహా ఈ ఏడాదిలోనూ విపరీతంగా పెరగడం వల్ల.. భారత ప్రజల దగ్గరున్న బంగారం విలువ కూడా అమాంతం పెరిగింది. ఈ క్రమంలోనే.. ప్రపంచదేశాల్లో చూస్తే బంగారం నిల్వలు అధికంగా ఉన్నటువంటి టాప్- 10 కేంద్ర బ్యాంకుల్లోని మొత్తం బంగారం నిల్వల కంటే కూడా.. భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అసోచామ్. భారతీయుల దగ్గర సుమారు 25 వేల నుంచి 34,600 టన్నుల వరకు బంగారం ఉందన్న అంచనాలు ఉన్నాయి. పెరిగిన ధరల ప్రకారం చూస్తే దీని విలువ రూ. 465 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం చూస్తే ఈ ఏడాదిలో బంగారం నిల్వలు అధికంగా ఉన్న 10 దేశాల కేంద్ర బ్యాంకుల దగ్గర పసిడి నిల్వల మొత్తం 24,399.51 టన్నుల వరకు ఉంటుంది. భారత ప్రజల దగ్గర ఇళ్లలో బంగారం అంచనా కనిష్టంగా ఉన్న 25 వేల టన్నుల కంటే కూడా తక్కువే. అత్యధికంగా కేంద్ర బ్యాంకుల్లో అమెరికా దగ్గర 8,133 టన్నుల వరకు బంగారం నిల్వలు ఉన్నాయి. తర్వాత వరుసగా జర్మనీ (3350 టన్నులు), ఇటలీ (2451), ఫ్రాన్స్ (2,437), రష్యా (2,311), చైనా (2,308 టన్నులు), స్విట్జర్లాండ్ (1039.9), భారత్ (880.3 టన్నులు), జపాన్ (845.97), నెదర్లాండ్స్ (641.28 టన్నులు) ఉన్నాయి. ఇక ఇళ్లలో వృథాగా పడి ఉన్న బంగారాన్ని వినియోగానికి తీసుకురావాలంటే.. పసిడి నగదీకరణ పథకాలు, పసిడి తనఖా రుణాలు, పసిడి ఆధారిత పొదుపు పథకాలు వంటివి చేపట్టాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.