ఏపీ డిప్యూటీ సీఎం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టాండప్ కమెడియన్ అనుదీప్ తన ప్రదర్శన సమయంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై, అలాగే ఆయన కుటుంబసభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. స్టాండప్ కామెడీ అంటే వినోదం పంచాలే కానీ.. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరచటం హాస్యమని అనిపించుకోదని కామెంట్లు పెడుతున్నారు. అనుదీప్ వ్యాఖ్యలు భావ ప్రకటనా స్వేచ్ఛ పరిధులు దాటాయని జనసేన నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే స్టాండప్ కమెడియన్ అనుదీప్ వ్యాఖ్యలపై జనసేన నేత సందీప్ పంచకర్ల స్పందించారు. అనుదీప్ వ్యాఖ్యలను ఖండించిన సందీప్ పంచకర్ల.. మహిళలను ద్వేషించడం, దూషణలు స్టాండ్ అప్ కామెడీ కాదని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రదర్శనలో.. మహిళలు, కుటుంబ సభ్యుల పేర్లను లాగడమనేది మర్యాద, భావ ప్రకటనా స్వేచ్ఛ హద్దులను దాటిన అత్యంత నీచమైన చర్య అంటూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. నిర్మాణాత్మక విమర్శ అనేది వేరే విషయమని.. కానీ మహిళలను లక్ష్యంగా చేసుకోవటం, వారిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. స్టాండప్ కమెడియన్ అనుదీప్‌కు ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ హెచ్చరించిన సందీప్ పంచకర్ల.. వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. వ్యక్తిత్వ హననం అనేది కళ కాదని.. అది ఒక నేరమంటూ జనసేన సందీప్ పంచకర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాజకీయ చూస్తూనే ఉన్నాం. దానికి ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే స్టాండప్ కామెడీ షోలో.. ఇలా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కమెడియన్ వ్యాఖ్యలు చేయడంపై జన సైనికులు భగ్గుమంటున్నారు.