‘ఇంటింటి రామాయణం’: పల్లవి కంట గుండె బద్దలయ్యే నిజం.. భరత్ రాజేశ్వరి కొడుకా.. అంటే నేను కన్న కూతుర్ని కాదా? ఓమైగాడ్

Wait 5 sec.

మొన్నటి వరకూ ఎందుకొచ్చిన సీరియల్‌రా బాబూ.. క్లోజ్ చేసేయండి అంటూ ఓ రేంజ్‌లో కామెంట్ల మోత మోగించారు సీరియల్స్ ఫ్యాన్స్. కానీ ఇప్పుడు అదే సీరియల్ ఊహించని ట్విస్ట్‌లతో ఊహకందని మలుపులతో సూపర్ హిట్ సీరియల్‌గా మారింది. అదే . అవని కష్టాలు, అక్షయ్‌తో గొడవలతో గోడకి కొట్టిన బంతిలా అక్కడక్కడే తిరిగేది కథ. కానీ ఎప్పుడైతే కథ అవని నుంచి చక్రధర్, రాజ్యలక్ష్మి, మీనాక్షిల వైపు మల్లిందో రోజుకో ట్విస్ట్‌ని రివీల్ చేస్తూ కథనాన్ని ఆసక్తికరంగా మార్చేశారు. మొదట్లో చక్రధర్, పల్లవిలతో కలిసి నానా కుట్రలు చేసి.. అవనిని ఆమె కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాడు. అయితే మీనాక్షి ఎంట్రీతో కథనం మొత్తం మారిపోయింది. మీనాక్షి ఎవరో కాదు.. చక్రధర్ మొదటి భార్య అని తెలియడం.. అవని మీనాక్షి-చక్రధర్‌లకు పుట్టిన కూతురే అని తెలియడం.. ఆ తరువాత చక్రధర్ మారిపోయి పల్లవిని దూరంపెట్టడం.. అవనిని కూతురుగా స్వీకరించడంతో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సాగింది. ఇక ఇప్పుడు అంతకుమించిన ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు పల్లవి ఎవర్ని అయితే అసహ్యించుకుంటే ఆమే అసలు తల్లి. అవును మీనాక్షే పల్లవి తల్లి. ఆ విషయం అవనికి తెలియడంతో పాటు.. అవని తమ్ముడు అని అవని రాజ్యలక్ష్మికి చెప్పేడం నేటి (ఏప్రిల్ 11) ఎపిసోడ్‌లోని ట్విస్ట్ కాగా.. ఈ విషయం పల్లవి తెలియడం కథనం మరింత ఉత్కంఠగా మారింది. నేటి ఎపిసోడ్‌లోని ప్రోమో చూస్తే భరత్.. రాజేశ్వరి కొడుకు అనే నిజం పల్లవి వినేస్తుంది. హాస్పిటల్ బెడ్‌పై రాజేశ్వరి కనిపించడం లేదని నర్సు చెప్పడంతో కంగారైన పల్లవి.. కమల్‌ని తీసుకుని వెతకడానికి వెళ్తుంది. రాజేశ్వరిని వెతికి ఇంటికి తీసుకొస్తుంది మన హీరోయిన్ అవని. రాజేశ్వరికి దిష్టి తీసేస్తుంది అవని. జ్యూస్ ఏమైనా కావాలా అని అవని అడిగితే.. ‘నీతో నేను మాట్లాడాలి అని అవనిని పక్కకి తీసుకుని వస్తుంది రాజేశ్వరి. వీళ్ల మధ్య అంత సీక్రెట్ ఏంటీ.? దేని గురించి అమ్మ అవనితో మాట్లాడాలని అనుకుంటుంది అంటూ వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్న గది దగ్గరకు వెళ్లి.. చెవేస్తుంది. ఏం కావాలో చెప్పండి పిన్నీ అని అవని అంటే.. ‘నాకు నా కడుపున పుట్టిన కొడుకు కావాలి? నువ్వు వెళ్లి భరత్ నీ కొడుకు కాదు అని మీ అమ్మకి చెప్పూ.. నా కొడుకుని నాకు అప్పగించు’ అని అంటుంది రాజేశ్వరి. లేదు పిన్నీ మా అమ్మ తట్టుకోలేదు అని అవని అంటే.. ‘నువ్వు తీసుకుని రాకపోతే.. నా కొడుకు నేనే వెళ్లి తీసుకుతెచ్చుంటా’ అని అంటుంది రాజేశ్వరి. ఆ మాటతో అవనే కాదు.. వీళ్ల మాటలు వింటున్న పల్లవి కూడా షాక్ అయ్యి షేక్ అయిపోతుంది.