Bank Loans: బ్యాంకులు.. పర్సనల్ లోన్, వెహికిల్ లోన్, గోల్డ్ లోన్, హోం లోన్, ఎడ్యుకేషన్ లోన్ ఇలా పలు రకాల లోన్లు ఆఫర్ చేస్తుంటాయి. అయితే వీటిల్లో పర్సనల్ లోన్ విషయానికి వస్తే వీటిని అన్‌సెక్యుర్డ్ లోన్లుగా చెబుతారు. ఇక్కడ మనం ఏం తాకట్టు పెట్టము కాబట్టి.. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. వైద్య అత్యవసర పరిస్థితుల్లో అయినా.. విహారయాత్రకు వెళ్లాలన్నా.. ఇంకా పిల్లల చదువులు, వివాహం, . క్రెడిట్ స్కోరు 750 అంతకంటే ఎక్కువగా ఉంటేనే తక్కువ వడ్డీకి లోన్లు పొందే వీలుంటుంది. అయితే రుణ నిర్వహణలో కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. వాటిని ఎదుర్కొనేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవేంటో తెలుసుకోవడం వల్ల.. ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర సమస్యలు లేకుండా ఉండొచ్చు. చాలా మంది లోన్ తీసుకునేటప్పుడు కేవలం వడ్డీ రేట్ల గురించి మాత్రమే ఆలోచించడం సరైనది కాదు. పర్సనల్ లోన్లకు వడ్డీ రేట్లతో పాటు అదనపు ఛార్జీలు కూడా ఉంటాయి. వీటిల్లో ప్రాసెసింగ్ రుసుములు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, బీమా ప్రీమియంలు, ఇంకా చెల్లింపుల్లో జాప్యం చేస్తే లేట్ ఫీజులు, డిఫార్ట్ ఫైన్స్ వంటివి ఉంటాయి. ఇవన్నీ మీకు సూచించిన వడ్డీ రేట్ల కంటే ఎక్కువ ఖర్చులయ్యేలా చేస్తాయి. అందుకే లోన్ విషయంలో అన్ని ఖర్చుల్ని గమనించాలి. సాధారణంగా ఈఎంఐ మొత్తం తక్కువగా ఉంచేందుకు బ్యాంకులు లోన్ టెన్యూర్ పొడిగిస్తాయి. అప్పుడు ఈఎంఐ తక్కువే ఉంది కదా అని రుణ గ్రహీతలు తాత్కాలిక ఉపశమనం పొందుతారు. కానీ ఎక్కువ కాలం చెల్లించాలి కాబట్టి.. వడ్డీ రూపంలో పూర్తి కాల పరిమితికి ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 12 శాతం వడ్డీ రేటుతో చూస్తే మూడేళ్లకు రూ. 5 లక్షల లోన్‌పై వడ్డీ దాదాపు రూ. 98 వేలుగా ఉంటే.. దీన్ని ఐదేళ్లకు పొడిగిస్తే రూ. 1.67 లక్షలు వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి.. లోన్ వీలైనంత త్వరగా ముగించడమే మంచిది. >> కొందరు తమ దగ్గర అదనపు నిధులు ఉన్నప్పుడు లేదా తాము కోరుకున్నప్పుడు టెన్యూర్ పూర్తికాకముందే ఎలాంటి అదనపు ఛార్జీల్లేకుండా లోన్ పూర్తిగా చెల్లించి క్లోజ్ చేసుకోవచ్చని భావిస్తుంటారు. పర్సనల్ లోన్లలో ఇది కాస్త వేరుగా ఉంటుంది. చాలా వరకు బ్యాంకులు.. ప్రీపేమెంట్ ఛార్జీల గురించి చెప్పవు. ఇంకొన్ని బ్యాంకులు ఒక లాకిన్ పీరియడ్ విధిస్తాయి. ఆ తర్వాత మాత్రమే.. ముందస్తు చెల్లింపులకు అనుమతిస్తాయి. ఇక్కడ కూడా మళ్లీ.. కొన్ని బ్యాంకులు ఛార్జీల్ని విధిస్తాయి. ఇవే.. మనపై పడే వడ్డీ భారాన్ని మరింత పెంచుతాయి.బ్యాంకులు.. క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్న వారికి ప్రీ అప్రూవ్డ్ లోన్స్ మంజూరు చేస్తుంటాయి. ఇక్కడ ఎంత అమౌంట్ అనేది ముందే ఫిక్స్ అయి ఉంటుంది. కాబట్టి.. కొందరు పెద్దగా డాక్యుమెంటేషన్ లేకుండా ఈజీగా అకౌంట్లలోకి డబ్బులు వస్తాయన్న కారణంతో అవసరం లేకపోయినా ఎక్కువ మొత్తం ప్రీ అప్రూవ్డ్ ఉన్నా తీసుకునేందుకు చూస్తుంటారు. అప్పుడు మీపై రుణ భారం పెరిగే అవకాశం ఉంటుంది.