2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. బయటికి రావడం లేదు. అప్పుడప్పుడు, అక్కడక్కడా కనిపిస్తున్నా.. పూర్తి స్థాయిలో మాత్రం ప్రజల్లో ఉండటం లేదు. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. దీంతో తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు.. కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే భారీ బహిరంగ సభతో కేసీఆర్.. ప్రజల ముందుకు రానున్నారు. ఈనెల 20వ తేదీన జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆ సభలోనే కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న .. రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. . హస్తం పార్టీతో 4 దశాబ్దాలుగా ఉన్న బంధాన్ని తెంచుకున్నారు. ఆ తర్వాత చేరాలని ఆహ్వానించారు. అనంతరం జీవన్ రెడ్డి.. నేరుగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి కలిశారు. ఆ సమయంలోనే పార్టీలో చేరే తేదీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జగిత్యాల జిల్లా మోతెలో ఈనెల 20వ తేదీన కేసీఆర్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో జీవన్ రెడ్డి.. గులాబీ కండువా కప్పుకోనున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సభ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు.. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి సహా పలువురు నేతలు పరిశీలించారు. ఈ బహిరంగ సభకు లక్షకు పైగా ప్రజలు వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు.ఇక చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటికి రానుండటంతో బీఆర్ఎస్ కేడర్‌లో జోష్ తిరిగి రానుంది. అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ప్రజల్లోకి రాకుండా కేవలం ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్.. చాలా అరుదుగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. దీంతో కేసీఆర్ ప్రసంగాలు లేక అటు బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ తగ్గింది. ఇటు ప్రజలు కూడా కేసీఆర్ వేసే పంచ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సభలో కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ ఏం మాట్లాడుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రజల అభీష్టం మేరకే జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతున్నారని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో తెలంగాణ గత రెండున్నరేళ్లలో అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు. మళ్లీ కేసీఆర్ పాలన రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నడూ అధికారం కోసం పాకులాడని వ్యక్తి జీవన్ రెడ్డి అని కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని గుర్తించిన జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు.