పునరుద్ధరించారు. ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ సమ్మె విరమణతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలను పునరుద్ధరించారు. దీంతో నెట్‌వర్క్ ఆస్పత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ వైద్య సేవలను ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. అయితే పదిరోజుల్లోగా రూ.1000 కోట్లు చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇవ్వటంతో ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ సమ్మె విరమించింది. దీంతో ఎన్టీఆర్ వైద్య సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. బకాయిల్లో వేయి కోట్లను ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) ప్రతినిధులు వెల్లడించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం నెట్ వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తోందంటూ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. బకాయిలను సకాలంలో చెల్లించకుండా.. ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్ పెడుతూ ఉండటంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారుతోందని ఆషా ప్రతినిధులు చెప్తున్నారు. ఆస్పత్రుల నిర్వహణతో పాటుగా, సిబ్బంది జీతాల చెల్లింపుల కోసం అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేయగా.. పది రోజులలో వేయి కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం నుంచి హామీ లభించటంతో సేవలను తిరిగి ప్రారంభించారు.మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా ఉన్న పథకం పేరును కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కింద రాష్ట్రంలోని ఉచితంగా అందిస్తున్నారు. రేషన్ కార్డు ఉన్నవారికి నెట్‌వర్క్ ఆస్పత్రులలో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే నెట్‌వర్క్ ఆస్పత్రులకు బకాయిలను సకాలంలో చెల్లించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఆస్పత్రి యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో ఆస్పత్రుల మెయింటెనెన్స్ కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందనేది నెట్‌వర్క్ ఆస్పత్రుల వాదన.