: ఆడ పిల్లల భవిష్యత్తు ఆర్థిక రక్షణ కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం (SSY) పథకాన్ని తీసుకొచ్చింది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న పథకంగా చెప్పవచ్చు. ఇందులో పన్ను ప్రయోజనాలు, ప్రభుత్వ మద్దతు లభిస్తుండడంతో లక్షల మంది ఈ పథకాన్ని ఎంచుకుంటున్నారు. ఈ స్కీమ్‌లో కనీస పెట్టుబడి ఏడాదికి రూ.250గా ఉండగా గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో ఏడాదికి 8.20 శాతం చొప్పున వడ్డీ ఇస్తున్నారు. తీసి పెట్టుబడి ప్రారంభించవచ్చు. అయితే, చాలా మంది తల్లిదండ్రుల్లో ఓ ప్రశ్న మెదులుతోంది. పాపకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు పెట్టుబడి ప్రారంభిస్తే ఈ స్కీమ్ ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది? అని. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన మెచ్యూరిటీ రూల్సుకన్య సమృద్ధి యోజన మెచ్యూరిటీ పీరియడ్ 21 సంవత్సరాలుగా ఉంటుంది. పాప వయసు ఆధారంగా మెచ్యూరిటీ అనేది మారదు. ఉదాహరణకు తల్లిదండ్రులు తమ పాప పుట్టిన వెంటనే ఎస్ఎస్‌వై అకౌంట్ తెరిస్తే పాపకు 21 ఏళ్లు వచ్చే సరికి అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. అలాగే 10 ఏళ్ల వయసు పాప పేరుపై ఖాతా తెరిచినా 21 సంవత్సరాలకే మెచ్యూర్ అవుతుంది. అంటే అప్పుడు మీ పాపకు 31 సంవత్సరాలు వస్తాయి. బేటీ బచావో, బేటీ పడావో క్యాంపెయిన్‌లో భాగంగా 2015, జనవరి 22వ తేదీన ఈ పథకాన్ని లాంచ్ చేశారు. ఆడ పిల్లల పేరుపై మాత్రమే ఖాతా తీసుకోవచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడ పిల్లలకు మాత్రమే ఖాతా ఇస్తారు. అయితే, ట్విన్స్, ట్రిప్లెట్స్ ఉన్న సందర్భంలో ఎక్కువ ఖాతాలు అనుమతిస్తారు. ఈ ఖాతాను దేశంలో ఎక్కడికైనా మార్చుకోవచ్చు. పాపకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు ఖాతాను నిర్వహిస్తారు. రూ.72 లక్షలు ఎప్పుడు వస్తాయి?ఉదాహరణకు ఈ 15 ఏళ్ల పాటు మీరు ప్రతి సంవత్సరం రూ.1.50 లక్షలు డిపాజిట్ చేశారు అనుకుందాం. మీ పెట్టుబడి మొత్తం రూ.22.5 లక్షలు అవుతుంది. దీనిపై 21 సంవత్సరాల వరకు వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయం (21 ఏళ్లు)లో వడ్డీ రూ.49,32,119 వరకు లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ నాటికి చేతికి రూ.71,82,119 వరకు అందే అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు 8.20 ప్రకారం అంచనా ఇది. ప్రభుత్వ వడ్డీ రేటు తగ్గిస్తే చేతికి వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ తగ్గవచ్చు.