‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’: నిజం చెప్పి ధీరజ్‌ కళ్లు తెరిపించిన చందు.. ‘అమూల్య జీవితాన్ని నాశనం చేసింది ప్రేమ కాదురా వల్లీ’

Wait 5 sec.

ప్రేమని ప్రాణంగా చూసుకుంటా నేను చూపిస్తున్నంత ప్రేమ ఈ లోకంలో ఎవరూ చూపింలేరు అంటూ బిల్డప్ కొట్టిన ధీరజ్.. అన్నమాటను నిలబెట్టుకోవడం కోసం నానా తిప్పలు పడుతున్నాడు. అమూల్య విషయంలో విశ్వక్‌తో రాయభారం చేసింది ప్రేమే అని అపార్థం చేసుకుంటున్న ధీరజ్‌కి.. ఎన్నోసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది ప్రేమ. అయితే ఇంట్లో వాళ్లంతా ఆ విషయంలో ప్రేమని క్షమించరు కానీ.. ధీరజ్ మాత్రం ప్రేమని క్షమించలేదు. అంతా తెలిసినప్పుడు తనకి ఎందుకు చెప్పలేదని ప్రేమని నిలదీసి ఆమెను దూరం పెట్టేశాడు ధీరజ్. అయితే ప్రేమకి యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం ధీరజ్‌లో ఉన్న ప్రేమ ఉప్పొంగింది. ఆమె ప్రాణాలకు ఏదైనా అపాయం ముంచుకొస్తుందేమోనని విలవిల్లాడిపోయాడు. ఇక యాక్సిడెంట్ అయిన తరువాత.. ధీరజ్ తనపై చూపిస్తున్న ప్రేమను చూసి పులకరించిపోతుంది ప్రేమ. ‘ఏరా.. లోపల ఇంత ప్రేమ పెట్టుకుని పైకిమాత్రం ప్రేమేలేనట్టు నటిస్తున్నావ్ కదరా.. ఉండరా నీ పని చెప్తానంటూ ఫోన్ తీసి.. ‘సమయానికి తగు సేవలు చేయనీ నీ శ్రీవారినీ’ అంటూ సాంగ్ పెడుతుంది. అప్పటికి ధీరజ్.. ప్రేమ కోసం జ్యూస్ తీస్తుంటాడు. దాంతో మనోడికి మండిపోతుంది. ప్రేమ కావాలనే ఏడిపిస్తుంటుంది. ధీరజ్ కోపంగా చూసేసరికి ఫోన్‌లో పాటని ఆపేసి.. ‘సమయానికి తగుసేవలు చేయనీ.. నా శ్రీవారినీ’ అంటూ పాట అందుకుంటుంది ప్రేమ. ఛీ ఛీ.. వెధవ కాకులు తెగ గాన కోకిలలా తెగ సింగుతుంది అంటూ ప్రేమ గాలి తీసేస్తాడు ధీరజ్. ఆ తరువాత ప్రేమకి జ్యూస్ ఇవ్వగా.. ‘ఇంత అందమైన గొంతుని పట్టుకుని కాకితో పోలుస్తావ్ ఏంట్రా.. కాకి వెధవా’ అని అంటుంది ప్రేమ. ‘అబ్బా ఛా.. అందమైన గొంతా.. చూసింది చాల్లే కానీ.. మూసుకుని తాగు’ అని అంటాడు ధీరజ్. ఇక రేపటి ఎపిసోడ్‌లో ధీరజ్ నెత్తికెక్కిన కళ్లని కిందకి దింపుతున్నాడు చందు. అమూల్య విషయంలో నా తప్పు లేదురా మగడా అని ప్రేమ ఎంత మొత్తుకున్నా ఈ పుత్రరత్నం వినిపించుకోకపోగా.. విశ్వక్-అమూల్యల మధ్య ప్రేమరాయబారం చేసింది ప్రేమేనని నిందలేస్తున్నాడు. దాంతో ధీరజ్‌కి నిజం చెప్పి కళ్లు తెరిపించాడు పెద్దోడు చందు. ప్రేమపై ధీరజ్ చిరాకుపడి చేయి లేపుతాడు ధీరజ్. అది చూసిన పెద్దోడు.. ‘రేయ్ బుద్ధి ఉందా నీకు?? భార్యపై చేయి ఎత్తుతావ్ ఏంట్రా’ అని అంటాడు. ‘నిన్ను కాపాడిందనే ఒకే ఒక్క కారణంతో సేవలు చేస్తున్నాను.. అమూల్య విషయంలో ఇది చేసిన నమ్మకద్రోహానికి దీన్ని నా జీవితంలో నుంచి మన ఇంట్లో నుంచి తరిమేయాలి’ అని అంటాడు ధీరజ్. ఆ మాటతో పెద్దోడు.. నోరు ముయ్ రా అంటూ ధీరజ్‌పైకి దూసుకుని వెళ్తాడు. ప్రేమ గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావ్..? ఆ విశ్వక్ గాడ్ని ప్రేమించమని ప్రేమ రాయబారం చేసింది ప్రేమ కాదు.. నా భార్య వల్లీ అని నిజం కక్కేస్తాడు చందు. దాంతో షాక్ అయిన ధీరజ్.. ఏంట్రా.. ఏమంటున్నావ్?? వల్లీ వదిన ఏంటీ అని అడుగుతాడు ధీరజ్. ‘అవును అన్నయ్యా.. పెద్దన్నయ్య చెప్పింది నిజమే.. వల్లీ వదినే దీనంతటికీ కారణం అని చెప్తుంది. దాంతో ధీరజ్.. పెద్దోడ్ని ఓదార్చుతున్నాడు. అంటే ఎవడో చెప్తేనే కానీ.. తన భార్య ఎలాంటిదో.. నిజంగా అలాంటి పని చేస్తుందో లేదో తెలుసుకోలేకపోతున్నాడన్న మాట ధీరజ్. పచ్చి తాగుబోతోడితోనైనా కాపురం చేయొచ్చేమో కానీ.. ఇలాంటి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా ఊహించుకుని అపార్థం చేసుకునేవాడితో కాపురం చేయడం మహా కష్టం సుమీ. మరి ప్రేమ.. ధీరజ్‌ని క్షమిస్తుందో లేదో తరువాతి ఎపిసోడ్‌లో చూద్దాం.