ఓవైపు మార్కెట్లు పడుతున్నా.. ఈ 2 టాటా స్టాక్స్ భారీ ర్యాలీ.. ఆరంభంలోనే 12 శాతం వరకు లాభాలు!

Wait 5 sec.

Tata Stocks: ఓవైపు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్న అనిశ్చిత పరిస్థితుల్లో టాటా గ్రూప్‌నకు చెందిన రెండు స్టాక్స్ మాత్రం భారీ ర్యాలీతో తమ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. సోమవారం మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే టాటా కెమికల్స్ లిమిటెడ్ (Tata Chemicals Ltd), టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (Tata Investments Corporation Ltd) షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఒక దశలో 12 శాతం వరకు పెరిగాయి. అందుకు ప్రధానంగా టాటా గ్రూప్ నుంచి మరో అతిపెద్ద ఐపీఓ వస్తుందన్న వార్తలు కారణమయ్యాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న టాటా సన్స్ పబ్లిక్ ఆఫరింగ్‌కు ట్రస్టీల్లో కీలక సభ్యులు మద్దతు తెలపడం ఈ ర్యాలీకి కారణమైంది. చేసి రూ.774 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని తాకాయి. గడచిన రెండున్నర నెలల కాలంలో చూసుకుంటే ఇదే అత్యధిక లాభం కావడం గమనార్హం. ఉదయం 11.25 గంటల సమయంలో ఈ స్టాక్ 6 శాతం లాభంతో 733.60 స్థాయిలో ట్రేడవుతోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1026.65 వద్ద ఉండగా, కనిష్ఠ ధర రూ.580.30 వద్ద ఉంది. ఈ స్టాక్ డివిడెండ్ 1.51 శాతంగా ఉండగా పీఈ రేషియో 92.84గా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.18600 కోట్లుగా ఉంది. వరకు ర్యాలీ చేసింది. దీంతో 7 వారాల గరిష్ఠ ధర రూ.722ను తాకింది.11.25 గంటల ప్రాంతంలో ఈ స్టాక్ 4.48 శాతం లాభంతో రూ.694.25 వద్ద ట్రేడవుతోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1184.70 వద్ద ఉండగా కనిష్ఠ ధర రూ.538.85గా ఉంది. ఈ స్టాక్ డివిడెండ్ 0.39 శాతంగా ఉండగా పీఈ రేషియో 86.35 వద్ద ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.3520 కోట్లుగా ఉంది. టాటా సన్స్‌లో వాటాటాటా సన్స్ కంపెనీలో టాటా కెమికల్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పోరేషన్ కి వాటా ఉండడంమే ఈ ర్యాలీకి కారణంగా తెలుస్తోంది. టాటా ట్రస్ట్స్ ట్రస్టీ, మాజీ డిఫెన్స్ సెక్రెటరీ విజయ్ సింగ్, టీవీఎస్ గ్రూప్‌ వేణు శ్రీనివాసన్ టాటా సన్స్ ఐపీఓకు మద్దతు పలికారు. ఇటీవలే షాపూర్జీ పల్లోంజి మిస్త్రీ సైతం టాటా సన్స్ లిస్టింగ్ చేయాలని ప్రకటించారు. కంపెనీలో నిర్వహణ, నియంత్రణలో పారదర్శకత ఉండేందుకు పబ్లిక్ ఇష్యూకు రావడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. దీంతో మరోసారి టాటా సన్స్ ఐపీఓ తెరపైకి వచ్చింది. అయితే, ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయంపై ఇది ఆధారపడి ఉన్నట్లు సమాచారం.