నెలకు రూ.2000 పెట్టుబడితో రూ.2.17 కోట్లు.. స్టెప్-అప్ SIP మ్యాజిక్ ఎలా పని చేస్తుందంటే?

Wait 5 sec.

Mutual Fund SIP Investment: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కోటీశ్వరులు కావచ్చు అనే మాట మీరు చాలా సార్లు వినే ఉంటారు. నెల నెలా కొద్ది మొత్తంలో సిస్టామాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడి పెడితే సరిపోతుందని, 10-15 సంవత్సరాల్లోనే కోటీ రూపాయల లక్ష్యాన్ని చేరుకోవచ్చని అనుకుంటాం. కానీ అసలు నిజం ఏమిటంటే మీరు పెట్టుబడి స్థిరంగా ఉండి బయట ధరలు భారీగా పెరిగితే మీ డబ్బు పెద్దగా రాబడిని ఇవ్వదు. మీకు వచ్చే మొత్తం భవిష్యత్తులో పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఉదాహరణకు ఒక 30 ఏళ్ల తర్వాత చేతికి రూ. 70 లక్షలు వచ్చేలా పెట్టుబడి పెడుతూ వెళ్తున్నారు అనుకుందాం. కానీ, ఆ సమాయనికి ఆ డబ్బు విలువ ఇప్పటి రూ. 12 లక్షలే అవుతుంది. అందుకు ప్రధాన కారణం ఇన్‌ఫ్లేషన్. మరి ద్రవ్యోల్బణాన్ని . మరి అది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం. సాధారణంగా ఉద్యోగంలో చేరిన సమయంలో చిన్న మొత్తంతో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని ప్రారంభిస్తాం. కానీ ప్రతి సంవత్సరం జీతం పెరుగుతున్నా పెట్టుబడిని మాత్రం అంతే కొనసాగిస్తుంటాం. ఇక్కడే మీరు అవగాహన రాహిత్యంతో భారీ రాబడిని కోల్పోతున్నారు. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ చెప్పిన వివరాల ప్రకారం 'ఒక చిన్న సిప్ మొత్తాన్ని రక్షించే ఏకైక మార్గం ప్రతి సంవత్సరం 10 శాతం చొప్పున పెంచడమే.' అని తెలిపారు. అంటే మీ పెట్టుబడిని ప్రతి ఏటా 10 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్లాలని సూచిస్తున్నారు. స్టెప్ అప్ మ్యాజిక్ ఎలా పని చేస్తుంది?మీరు 25 ఏళ్ల వయసులో నెల నెలా రూ. 2,000 చొప్పు సిప్ పెట్టుబడి మొదలుపెట్టారు అనుకుందాం. 55 ఏళ్ల వయసు వరకు అంటే 30 ఏళ్లు కొనసాగిస్తే 12 శాతం రాబడి అంచనాతో మీకు రూ. 70.6 లక్షల వరకు అందుతాయి. వినడానికి పెద్ద మొత్తంగా ఉన్నా 6 శాతం ద్రవ్యోల్బణం అంచనా వేస్తే అప్పటి 70 లక్షల విలువ రూ. 12.3 లక్షలతో సమానం. అంటే మీ రిటైర్మెంట్ జీవితానికి అది సరిపోదు. రూ. 2.17 కోట్లు వస్తాయి. 'మీ కెరీర్ ఎదుగుదలతో పాటు పెట్టుబడిని పెంచడం ద్వారా ద్రవ్యోల్బణం మీ సంపదను హరించకుండా కాపాడొచ్చు' అని సీఏ నితిన్ కౌశిక్ తెలిపారు. కాంపౌండింగ్ మ్యాజిక్ అనేది కాలంతో మాత్రమే కాకుండా మీ పెట్టుబడి వేగం మీద కూడా ఆధారపడి లాభాలు అందిస్తుందని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడితో పాటు ఏటా మీ బూస్టర్ డోస్ ఇవ్వడం మర్చిపోవద్దని సూచిస్తున్నారు. మొదటి సంవత్సరం రూ.2000 ఆ తర్వాత ఏడాది రూ.2,200 చొప్పున మీరు పెంచుకుంటూ 30 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టగలిగితే మీ చేతికి రూ.2.17 కోట్ల వరకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఇది అంచనా మాత్రమే. మీరు ఎంచుకున్న ఫండ్ మంచి పనితీరు కనబరిచినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అందుకే జాగ్రత్తగా ఫండ్ ఎంచుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి.