Stock Market: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక్కడ చాలా అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంటాయి. ఆయా కంపెనీల ఫలితాలు, ప్రకటనలు, పెట్టుబడి వ్యూహాలు, పనితీరు, ప్రణాళికలు వీటిని బట్టి స్టాక్ హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. ఒక్క ప్రకటనతో భారీగా పెరిగే షేర్లు ఉంటాయి.. అదే సమయంలో అదే ప్రకటనతో పతనం అయ్యేవి కూడా ఉంటాయి. ఇక్కడ ఓపిక చాలా ముఖ్యం. పడిపోయింది కదా అని వెంటనే అమ్మేయొద్దు.. ఆర్థిక క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టాలి. స్వల్ప కాలం కోసం కంటే దీర్ఘకాలం పాటు పెట్టుబడుల్ని కొనసాగించాలి. ఇంకా మంచి అవగాహన ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయడం మర్చిపోవద్దు. ఏం తెలియకుండా పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి రావొచ్చు. ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్‌లో (ఏప్రిల్ 13) నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యుద్ధం ముగింపుపై ఆశల నేపథ్యంలో గత వారం సూచీలు లాభాల్ని నమోదు చేయగా.. మళ్లీ పరిస్థితి మొదటికే వచ్చేసింది. ఇరాన్- అమెరికా కాల్పుల విరమణ పాటిస్తుండగా.. సడెన్‌గా చర్చలు మళ్లీ విఫలం అయ్యాయి. ఇది ఉద్రిక్తతల్ని పెంచేసింది. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని ట్రంప్ ఆదేశించారు. ఈ కారణంతోనే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో . తర్వాత కాస్త కుదుటపడి ప్రస్తుతం వార్త రాసే సమయంలో మధ్యాహ్నం 2 గంటలకు సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా నష్టంతో 77 వేల స్థాయిలో కొనసాగుతోంది. నిఫ్టీ 165 పాయింట్లు తగ్గి 23,880 స్థాయిలో ఉంది. మార్కెట్లు పతనమవుతున్న తరుణంలో రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎం అండ్ ఎం వంటి పలు హెవీ వెయిట్ స్టాక్స్ కూడా నష్టపోతున్నాయి. ఓలా షేర్లు భారీ పతనం..ఇక్కడ మనం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ షేర్ల గురించి తెలుసుకోవాలి. సోమవారం సెషన్‌లో ఓలా స్టాక్.. ఇంట్రాడేలో 8 శాతం వరకు పడిపోయింది. కిందటి రోజు రూ. 40.88 వద్ద ముగియగా ఇంట్రాడేలో 8 శాతం తగ్గి రూ. 37.70 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. సంస్థ మార్కెట్ విలువ రూ. 16.08 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 71.25 కాగా.. కనిష్ఠ ధర రూ. 22.25 గా ఉంది. . గత 3 రోజుల్లోనే 42 శాతం, వారం రోజుల్లో 80 శాతం వరకు పెరిగింది. ఇప్పుడు మార్కెట్ల పతనం నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొనగా స్టాక్ పతనమైంది.