వంటగదిలోకి భార్యను వెళ్లకుండా అడ్డుకోవడం మానసిక క్రూరత్వమే.. బాంబే హైకోర్టు

Wait 5 sec.

అత్తింటిలో మహిళను వంట చేయకుండా నిరోధించడం అనేది ఆమె గౌరవాన్ని దెబ్బతీసే ఒక రకమైన మానసిక క్రూరత్వమేనని స్పష్టం చేసింది. తనకు వ్యతిరేకంగా భార్య పెట్టిన వేధింపుల కేసును కొట్టివేయాలంటే భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన ఓ జంటకు 2022లో వివాహమైంది. అయితే, పెళ్లైన కొద్ది రోజుల నుంచే భార్యాభర్తల మధ్య విబేధాలు మొదలయ్యాయి. భార్యను వేధింపులకు గురిచేశారు. అత్తింటివాళ్లు తనను అత్యంత హీనంగా చూశారని, తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారని ఆమె ఆరోపించారు.భర్త, అత్తమామలు తనను వంటగదిలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని,ఆమె ఆరోపించింది. ఇంట్లో వంట చేసుకునే తన హక్కును లాక్కున్నారని, కనీసం సరైన భోజనం కూడా పెట్టకుండా వేధించారని ఆమె వాపోయారు. అంతేకాకుండా, తన నగలను ఇంటి నుంచి బయటకు విసిరేశారని, తన పుట్టింటికి వెళ్లకుండా అడ్డంకులు సృష్టించారని, విడాకుల కోసం తనపై ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపణలు చేశారు. అయితే, విడాకుల పిటిషన్‌కు ప్రతీకారంగానే తనపై భార్య ఈ ఫిర్యాదు చేశారని భర్త తరఫు న్యాయవాదులు వాదించారు.ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఊర్మిళా జోషి-ఫాల్కే.. భర్తకు వ్యతిరేకంగా నమోదైన వేధింపుల కేసును కొట్టేయడానికి నిరాకరించారు. భార్యను నిరంతరం వేధించడం, ఆమె కదలికలను పరిమితం చేయడం, ఇంట్లో ఆమెకు కనీస అవసరాలను అందకుండా చేయడం వంటివి మానసిక క్రూరత్వానికి స్పష్టమైన ఉదాహరణలని వ్యాఖ్యానించారు.‘‘భారత శిక్షాస్మృతిలో సెక్షన్ 498-Aలో XXAను ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం భర్త లేదా అతడి బంధువుల ద్వారా భార్య హింసకు గురికాకుండా నిరోధించడమే అనడంలో ఎటువంటి సందేహం లేదు’’ అని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. ఇక, తన అత్త ప్రోత్సాహంతోనే భర్త తనను వేధించాడని భార్య ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. కేవలం భర్త తల్లి అయినంత మాత్రాన ఆమెను నిందితురాలిగా చేయలేమని స్పష్టం చేస్తూ, అత్తగారిపై ఉన్న అభియోగాలను కొట్టివేయాలని కోర్టు ఆదేశించింది.