షేర్లు కొని మర్చిపోయిన సొమ్ము రూ.89000 కోట్లు.. 1671 కంపెనీల్లో మూలుగుతోన్న డబ్బు.. మీది కూడా ఉందేమో చెక్ చేసుకోండి!

Wait 5 sec.

: గత ఏడాది 2025 డిసెంబర్ నాటికి బ్యాంకు డిపాజిట్లు, ఈక్విటీలు, ఇన్సూరెన్స్, ఈపీఎఫ్ అకౌంట్లు, మ్యూచుఫండ్లలో ఎవరూ క్లెయిమ్ చేయని సంపద రూ.2.2 లక్షల కోట్లుగా ఉన్నట్లు వ్యక్తిగత ఫైనాన్స్ అడ్వైజరీ సంస్థ ఫైనాన్స్ మ్యాగజైన్ రిపోర్ట్ చెబుతోంది. ఇందులోనూ ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఎవరూ తీసుకోని సొమ్ము వేగంగా పెరుగుతోంది. షేర్ మొత్తం 1671 కంపెనీల వద్ద ఇన్వెస్టర్ల సొమ్ము మూలుగుతోందని తెలిపింది. బ్యాంకు డిపాజిట్ల తర్వాత షేర్ మార్కెట్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు రెండో స్థానంలో ఉన్నాయి. రూ. 2.2 లక్షల కోట్లకు పైగా విలువైన ఈ పెట్టుబడులు తక్కువ రాబడినిచ్చే నిద్రాణమైన పొదుపులు కావు. కానీ క్లెయిమ్‌లు అందకపోవడం, పని చేయని ఖాతాలు లేదా పెట్టుబడిదారులు, వారి కుటుంబాలలో అవగాహన లోపం కారణంగా అందుబాటులో లేకుండా పోయిన అధిక వృద్ధి సామర్థ్యం గల పెట్టుబడులు ఉన్నాయి. అయితే పెట్టుబడులు స్థిరంగా తమ విలువను కోల్పోతున్నాయి. వ్యవస్థల వద్ద చిక్కుకుపోయిన పెట్టుబడులకు రిటర్న్స్ చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్షల కోట్ల సొమ్ము సరైన వ్యక్తులకు చేరడం లేదు. బహుళ ఫైనాన్షియల్ అసెట్స్ రూపంలో ఈ సొమ్ము ఉన్నట్లు నివేదిక తెలిపింది. బ్యాంక్ డిపాజిట్లలో రూ.97,545 కోట్లతో 44.2 శాతం సొమ్ము ఎవరూ తీసుకోలేదు.ఈక్వీటీ షేర్లలో రూ.89,004 కోట్లతో 40.3 శాతంఇన్సూరెన్స్ పాలసీల్లో రూ.20,062 కోట్లతో 9.1 శాతంఈపీఎఫ్ అకౌంట్లలో రూ.10,915 కోట్లతో 4.9 శాతంమ్యూచువల్ ఫండ్లలో రూ.3,452 కోట్లతో 1.6 శాతంఆర్ఈఐటీఎస్, ఇన్విట్స్, ఎన్సీడీల్లో రూ.764 కోట్లతో 0.3 శాతం, ఐఈపీఎఫ్ రూల్స్, ఐఆర్‌డీఏఐ యాన్యువల్ రిపోర్ట్స్, ఈపీఎఫ్ఓ డేటా, సెబీ యాన్యువల్ రిపోర్ట్స్ ఆధారంగా తీసుకున్నారు. బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను ఆర్‌బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవర్నెస్ ఫండ్‌లో జమ చేస్తున్నారు. వీటికి 3 శాతం సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ద్రవ్యోల్బణం కారణంగా ఈ డబ్బు విలువ భారీగా తగ్గిపోతుందని చెప్పవచ్చు. స్టడీ ప్రకారం గడిచిన 10 ఏళ్ల కాలంలోనే ఈ డబ్బు 34 రెట్లు పెరిగింది. దశాద్దం క్రితం అంటే 2015లో రూ.7875 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉంటే 2025 నాటికి 98,545 కోట్లకు పెరిగాయి. ఇక షేర్ మార్కెట్లో చూసుకుంటే దాదాపు 1671 కంపెనీలకు చెందిన 166 కోట్ల షేర్లు కొనుగోలు చేసి ఎవరూ క్లెయిమ్ చేసుకోని సొమ్ము విలువ రూ.89,004 కోట్లుగా ఉంది. ఇది ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ వద్ద ఉంటాయి.