వచ్చే 48 గంటలూ బయటకు రావద్దు.. ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం అడ్వైజరీ

Wait 5 sec.

ఇరాన్‌లోని భారతీయులకు అక్కడ భారత రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీచేసింది. రాబోయే 48 గంటల పాటు భారతీయులు తాము ఉన్నచోటనే ఉండాలని, బయటకు రావద్దని సూచించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, విద్యుత్, సైనిక స్థావరాలు, బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. ‘‘ఎంబసీ అద్దెకు తీసుకున్న హోటళ్లలో ఉన్నవారు.. అక్కడి రాయబార కార్యాలయ బృందాలతో నిరంతరం సంప్రదిస్తూ ఉండాలి’’ అని అడ్వైజరీలో తెలిపింది. ఎప్పటికప్పుడు రాయబార కార్యాలయం అప్‌డేట్‌లను గమనిస్తూ ఉండాలని అప్రమత్తం చేసింది. అంతేకాదు, అత్యవసర సహాయం కోసం 989128109115, 989128109102, 989128109109, 989932179359 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని పేర్కొంది. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన 48 గంటల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ అడ్వైజరీ వచ్చింది.ఇరాన్‌ నాగరికతను నామరూపాల్లేకుండా చేస్తామని ట్రంప్ మరోసారి ఘాటు హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రాత్రి ఇరాన్ నాగరికత మొత్తం అంతమవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.