‘ధురంధర్ 2’ పాట వివాదం.. నష్టపరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించిన నిర్మాణ సంస్థ

Wait 5 sec.

రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘: ది రివెంజ్’. ఉగాదికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పటికే ఎన్నో రికార్డులను చెరిపేసి, సరికొత్త రికార్డులు సృష్టించింది. మూడో వారంలోనూ భారీ వసూళ్లతో దూసుకుపోతోన్న ఈ చిత్రాన్ని వరుస కాపీరైట్‌ వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని పాటపై వివాదం చెలరేగింది. అనుమతి లేకుండా తమ పాటను వాడుకున్నారంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. 'ధురంధర్', 'ధురంధర్ 2' సినిమాల్లో పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో చెప్పాల్సిన పనిలేదు. మార్చి వరకూ 'ధురంధర్' పాటలు మోత మోగించగా.. ఇప్పుడు ఎక్కడ చూసినా 'ధురంధర్: ది రివేంజ్’ సాంగ్స్ వినిపిస్తున్నాయి. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్ కంపోజ్ చేసిన ఓల్డ్ క్లాసిక్ సాంగ్స్ రీమిక్స్ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటిల్లో ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ అనే పాట తెగ వైరల్ అవుతోంది. అయితే తమ పర్మిషన్ తీసుకోకుండా పాత పాటని రీమిక్స్ చేశారంటూ త్రిమూర్తి ఫిల్మ్స్ సంస్థ కోర్టులో దావా వేసింది1989లో సన్నీ డియోల్, మాధురీ దీక్షిత్ నటించిన సూపర్ హిట్ ‘త్రిదేవ్’ సినిమాలోని ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ పాట ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచింది. ఇప్పుడే అదే పాటని 'ధురంధర్ 2'లో వాడుకున్నారు. అయితే ఆ పాటకు సంబంధించిన ఆడియో రైట్స్ తమవద్దే ఉన్నాయని.. ‘ధురంధర్ 2’ మేకర్స్ అనుమతి తీసుకోకుండా ఈ పాటను ఉపయోగించారని నిర్మాణ సంస్థ త్రిమూర్తి ఫిల్మ్స్‌ ఆరోపిస్తోంది. తమ పాటని సినిమా నుంచి తొలగించాలని, లేదంటే నష్టపరిహారం ఇవ్వాలని కోరింది. దీనిపై డైరెక్టర్ ఆదిత్య ధర్, బి62 స్టూడియోస్‌ సంస్థ సమాధానమివ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ‘ధురంధర్ 2’ కథపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తన స్టోరీని కాపీ కొట్టారంటూ సంతోష్ కుమార్ అనే దర్శకుడు ఆరోపిస్తున్నారు. దీనిపై బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై ఏప్రిల్ 16న తదుపరి విచారణ జరగనుంది. అప్పటి వరకూ ఆదిత్య ధర్ గురించి ఏం మాట్లాడకూడదంటూ సంతోష్ కు సూచిస్తూ, న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివాదం నడుస్తుండగానే ఇప్పుడు తమ పర్మిషన్ లేకుండా పాట వాడుకున్నారంటూ 'ధురంధర్ 2' మేకర్స్ పై మరో పిటిషన్ దాఖలవ్వడం హాట్ టాపిక్ గా మారింది.