యుద్ధానికి బ్రేకులు- బంగారం ధరలకు రెక్కలు.. రాత్రికి రాత్రే రూ.4000 జంప్.. ఈరోజు గోల్డ్ రేట్లు ఇవే..

Wait 5 sec.

Gold Rate Today: పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్. గత కొద్ది రోజులుగా స్తబ్దుగా కొనసాగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన క్రమంలో పసిడి ధరలు రెక్కలొచ్చాయి. వెండి ధర కిలోకు ఏకంగా రూ.10 వేల మేర పెరిగింది. దాదాపు రూ.4000 వరకు దూసుకెళ్లింది. పశ్చిమాసియాలో అమెరికా డాలర్ విలువ వంటి పరిణామాలతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. బంగారం, వెండికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగినట్లు హెచ్‌డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. ట్రంప్ ప్రకటన తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు 20 శాతం వరకు దిగివచ్చినట్లు తెలిపింది. ఇంధన ధరలు తగ్గిన క్రమంలో అమెరికా ఫెడ్ సహా ఇతర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడాన్ని వాయిదా వేయవచ్చని అభిప్రాయపడిది. సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు బంగారం, వెండి వైపు పెట్టుబడులు మళ్లుతుంటాయి. ఇప్పుడు కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో ఏప్రిల్ 9వ తేదీన బంగారం, వెండి రేట్లు తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 44 డాలర్ల మేర దూసుకెళ్లాయి. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 4704 డాలర్ల వద్దకు ఎగబాకింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 1.47 శాతం మేర పెరిగింది. దీంతో వెండి ధర ఔన్సుకు 73 డాలర్ల స్థాయికి చేరుకుంది. హైదరాబాద్‌లో బంగారం ధరఈరోజు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.3980 మేర దూసుకెళ్లింది. దీంతో తులం బంగారం రేటు రూ. 1,53,820 వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు రూ.365 మేర దూసుకెళ్లింది. దీంతో తులం రేటు రూ.1,41,000 వద్దకు ఎగబాకింది. రూ.10 వేలు పెరిగిన వెండిబంగారంతో పాటు వెండి రేటు సైతం ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు పెరగడం గమనార్హం. గత కొద్ది రోజులుగా స్తబ్దుగా కొనసాగుతున్న వెండి ధరకు ఇవాళ ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీంతో కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 2,65,000 స్థాయికి చేరుకుంది. పైన చెప్పిన బంగారం, వెండి రేట్లు ఏప్రిల్ 9వ తేదీ గురువారం రోజు ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో ధరలు మధ్యాహ్నం లోపు మారిపోతుంటాయి. కొనుగోలు చేయాలనుకునే వారు స్థానికంగా ఉండే బంగారం ధరలు తెలుసుకోవడం మంచిది.