EPF Changes: ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే వారికి ఈపీఎఫ్ గురించి తెలిసే ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నడిపించే గొప్ప సామాజిక భద్రతా పథకం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) దీనిని నిర్వహిస్తుంటుంది. ప్రైవేట్ రంగంలో పని చేసే ఉద్యోగులకు పొదుపు, భద్రత, రిటైర్మెంట్ ప్రయోజనాల్ని ఇది కల్పిస్తోంది. ఇటీవలి కాలంలో ఈపీఎఫ్ఓ.. ఉద్యోగులకు సేవల్ని మరింత మెరుగుపరుస్తోంది. ఇందులో భాగంగానే తన డిజిటల్ వ్యవస్థను ఆధునికీకరిస్తూ ఈపీఎఫ్ఓ 3.o. ప్రాజెక్ట్ ప్రకటించింది. త్వరలోనే దీనిని లాంఛ్ చేయనుంది. దీని ద్వారా ఉద్యోగులకు మరిన్ని మెరుగైన సౌకర్యాల్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే కొంత కాలంగా ఈపీఎఫ్ఓ.. నిబంధనలు, ఇతర ఇబ్బందుల్ని తొలగిస్తోంది. చాలా వరకు సులభంగా, సరళంగా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తీసుకొచ్చిన కొత్త రూల్స్.. ఈపీఎఫ్ఓ 3.O. కింద మార్పుల్ని ఒకసారి గమనిద్దాం. ఇందులో అన్నింటికంటే ముఖ్యమైనది యూపీఐ ద్వారా నగదు ఉపసంహరణ. ఇది అత్యవసర సమయాల్లో డబ్బులు కావాలనుకునే వారికి ఎంతో మేలు చేయనుంది. ఇప్పుడు పేపర్ వర్క్ వల్ల తప్పులు ఉండటం.. ఆలస్యం కావడం.. నిలిచిపోవడం ఇలా జరుగుతున్నాయి. వేచి చూసే సమయం చాలా వరకు తగ్గుతుంది. ఏటీఎం ద్వారా క్యాష్ విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని ఈపీఎఫ్ఓ 3.O. కల్పిస్తుంది. మరోవైపు . ఇక్కడ మానవ ప్రమేయం లేకుండానే.. గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు డబ్బులు వేగంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ పెద్దగా డాక్యుమెంట్ల అవసరం కూడా ఏం ఉండదు. ఆధార్ సీడింగ్ ఉంటే సరిపోతుంది. ఇతర మార్పుల విషయానికి వస్తే.. విత్‌డ్రా కేటగిరీలో 13 కుపైగా ఉండేవి. పరిమిత సంఖ్యలో ఉండేవి. ఇంకా విత్‌డ్రా మొత్తంపైనా నిబంధన ఉండేది. ఇప్పుడు అత్యవసరాలు, హౌసింగ్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు అని 3 విభాగాలు తెచ్చింది. కొన్ని అవసరాలకు డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే గతంలో ఏడేళ్ల వరకు సర్వీస్ ఉండాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు దీనిని అన్ని కేటగిరీలకు మినిమం సర్వీస్ పీరియడ్ ఏడాదికి కుదించారు. అంతకుముందు కేవలం ఉద్యోగి జమ చేసిన మొత్తం మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఉండేది. ఇప్పుడు యజమాని వాటాను కూడా తీసుకోవచ్చు. గతంలో విత్‌డ్రా చేసుకునే మొత్తంపై పరిమితులు ఉండేవి. ఈ అవసరానికి ఇంత వరకే అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు అర్హత ఉన్న మొత్తంలో 75 శాతం వరకు నిధుల్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. నిరుద్యోగం సమయంలో కూడా గతంలో కొన్ని నిబంధనలతో పాక్షిక నగదు ఉపసంహరణకు అవకాశం ఉండేది. . సంవత్సరం తర్వాత మిగతా 25 శాతం కూడా తీసుకోవచ్చు. అంతకుముందు చాలా వరకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవసరం పడేది. ఇక్కడ అంత అవసరం లేదు. చాలా కేసుల్లో 75 శాతం వరకు డాక్యుమెంటేషన్ లేకుండానే విత్‌డ్రా చేసుకోవచ్చు.