ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం 15వ మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ - లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుండగా, మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఈ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మూడు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ రెండింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో నాలుగో మ్యాచ్‌లో అయినా విజయం సాధించి, ఫ్యాన్స్‌లో జోష్ నింపాలని కెప్టెన్ అజింక్య రహానే చూస్తున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడిపోగా, మరో మ్యాచ్ రద్దయింది. ఈ మూడో మ్యాచ్‌లో లక్నోని చిత్తు చేయాలని కేకేఆర్ చూస్తోంది. ఇక పేపర్ మీద బలంగా ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లోకి వచ్చే సరికి తేలిపోతోంది. తొలి మ్యాచ్‌లో పంజాబ్ మీద ఓడిపోయిన లక్నో.. రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తక్కువ స్కోర్‌ను కూడా ఆఖరి ఓవర్ వరకూ తీసుకొచ్చింది. దాంతో కేకేఆర్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో అయినా కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐపీఎల్ హిస్టరీలో కోల్‌కతా నైట్ రైడర్స్ - లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఆరు మ్యాచ్‌లు జరిగాయి. అందులో లక్నో సూపర్ జెయింట్స్ అత్యధికంగా నాలుగు మ్యాచ్‌లలో గెలవగా, లక్నో రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో కూడా లక్నోదే పైచేయిగా ఉంది. మూడు మ్యాచ్‌లలో రెండు లక్నో గెలవగా, ఒక్కటే కేకేఆర్ విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అంచనాఫిన్ అలెన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ, కామెరూన్ గ్రీన్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, క్యార్తీక్ త్యాగీ, వరుణ్ చక్రవర్తి/నవదీప్ సైనీ, బ్లెస్సింగ్ ముజరబానీ, వైభవ్ అరోరా. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అంచనాఎయిడెన్ మార్కరమ్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బదోనీ, నికోలస్ పూరన్, అబ్దుల్ సమ్మద్, ముకుల్ చౌదరి, షాబాజ్ అహ్మద్ / ఎం సిద్ధార్థ్, మొహమ్మద్ షమీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ.