జనగణనలో సమాధానాలు ఇవ్వాల్సిందే.. తప్పుడు సమాచారమిస్తే 3 ఏళ్ల జైలు

Wait 5 sec.

వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే జనగణనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జనగణనలో భాగంగా వివరాలు సేకరించే ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి అడిగే ప్రశ్నలకు ప్రజలంతా తప్పనిసరిగా సమాధానాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జనాభా లెక్కించడం కోసం కావాల్సిన ప్రశ్నలను అడిగే అధికారం ఎన్యుమరేటర్లు కలిగి ఉంటారని.. అలాంటి వారికి జవాబులు ఇవ్వకపోతే రూ.1000 ఫైన్ వేయనున్నట్లు తెలిపింది. ఇక జనగణనలో తప్పుడు సమాచారం ఇస్తే 3 ఏళ్ల జైలుశిక్ష విధించనున్నారు. జనగణనలో సమాచారం సేకరించే ఎన్యుమరేటర్లు విధులు నిర్వర్తించకపోయినా.. ప్రజలకు ఇబ్బంది కలిగించినా జైలుశిక్ష, జరిమానా ఉంటుందని స్పష్టం చేసింది. జనగణనకు సంబంధించి నిబంధనలకు కట్టుబడి ప్రతి ఒక్కరు సమాధానాలు చెప్పాలని ప్రభుత్వం తెలిపింది. జనగణన కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను.. ఆయా శాఖల హెచ్ఓడీలకు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఈ మార్గదర్శకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. మతం, ఆచారం, సంప్రదాయం ప్రకారం.. మహిళలు తమ భర్తల పేర్లు చెప్పకూడదంటే కుదరని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా జనగణన వివరాల అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పాలసీలను తయారు చేసుకోవడానికి.. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు.. పంచాయతీ, స్థానిక సంస్థల వార్డులు, డివిజన్లను విభజించేందుకు ఈ జనగణనలో ఇచ్చి సమాచారమే కీలకమని తెలిపింది. అందుకే తప్పుడు సమాచారం ఇవ్వకుండా.. నిజమైన సమాచారాన్ని ఎన్యూమరేటర్లకు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎన్యూమరేటర్లను ఇళ్ల వరకు రానివ్వాలని.. తర్వాత ఏదైనా అవసరమైతే ఆ ఇళ్లకు ఏవైనా లేఖలు అతికించేందుకు వీలుగా ఉంటుందని తెలిపింది. ఈ సందర్భంగా జనగణన చేపట్టే సిబ్బందికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక సూచనలు, హెచ్చరికలు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను ఎన్యూమరేటర్లు వ్యతిరేకించినా.. ఇతరుల విధులకు ఆటంకం కలిగించినా వారికి రూ.1000 వరకు జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. సెన్సెస్‌ చట్టం-1948లోని పార్ట్‌(ఎ) కింద ఎన్యూమరేటర్లు నేరం చేసినట్లు రుజువైతే వారికి 3 ఏళ్ల పాటు జైలుశిక్ష ఉంటుందని తేల్చి చెప్పింది. ఎన్యూమరేటర్లకు మాత్రమే కాకుండా.. ఉద్దేశపూర్వకంగా ప్రజలు తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా వివరాలు ఇచ్చేందుకు నిరాకరించిన ప్రజలకు కూడా అంతే జరిమానా.. జైలుశిక్ష విధించనున్నట్లు మార్గదర్శకాల్లో తెలిపింది.