పుదుచ్చేరి పోలింగ్: బైకుపై వచ్చి ఓటు వేసిన సీఎం రంగస్వామి.. వీడియో వైరల్

Wait 5 sec.

: ఓట్ల పండుగలో ప్రముఖులు పాల్గొనేటప్పుడు సాధారణంగా భారీ కాన్వాయ్‌లు, సైరన్లు, భద్రతా సిబ్బంది హడావుడి కనిపిస్తుంటుంది. కానీ పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగసామి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎలాంటి అధికారిక హంగు, ఆర్భాటాలు లేకుండా.. సామాన్య పౌరుడిలా ఓటు వేసేందుకు వచ్చారు. ముఖ్యంగా తన బైకును తానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాన్వాయ్ వదిలి బైక్‌పై సామాన్యుడిలా ప్రయాణంముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఉండే ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి.. ఆయన తన ఇంటి వద్ద నుంచి పోలింగ్ కేంద్రం వరకు ద్విచక్ర వాహనంపైనే ప్రయాణించారు. హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆయన రోడ్డుపై వెళ్తుంటే దారి పొడవునా జనం ఆసక్తిగా తిలకించారు. పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నాక కూడా.. ఆయన ఏమాత్రం ప్రత్యేకత కోరుకోకుండా సామాన్యులతో కలిసి క్యూలో నిలబడి మరి ఓటు వేశారు.రంగసామి ఇలా బైక్‌పై రావడం ఇదే మొదటిసారి కాదు. 2024 సాధారణ ఎన్నికల సమయంలోనూ ఆయన బండి మీద వచ్చే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పుడు కూడా ఈయనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. అంతకు ముందు కూడా ఆయన చాలా సార్లు పరిపాలనా వ్యవహారాల కోసం, ప్రజలను కలవడానికి ఇలాగే బైక్‌పై వెళ్తూ వార్తల్లో నిలిచారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఇంత నిరాడంబరంగా ఉండటం, సామాన్యులకు చేరువగా మెలగడం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తుండగా.. పుదుచ్చేరి ప్రజలు ఆయన్ను ప్రేమగా బైక్ సీఎం అని పిలుచుకుంటున్నారు. సీఎం చేసిన పనితో ఓటర్లలో స్ఫూర్తి..!"ముఖ్యమంత్రి గారే స్వయంగా బైక్‌పై వచ్చి ఓటు వేసినప్పుడు.. మనకెందుకు బద్ధకం" అంటూ స్థానిక యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం విశేషంగా నిలుస్తోంది. బైకుపై ప్రయాణించి.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత కీలకమో చెప్పడమే కాకుండా అధికార గర్వం లేకుండా ఎలా ఉండాలో కూడా ఆయన చెప్పకనే చెప్పారు. మరీ సీఎం చేసిన పని చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో వెల్లడించేయండి.