Fall: పశ్చిమాసియాలో ఇటీవల కొంత కాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి ఆఖర్లో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభం కాగా.. తర్వాత అమెరికా కూడా ఇజ్రాయెల్‌తో కలిసింది. ఈ దేశాల మధ్య భీకర యుద్ధం నడిచింది. ఇరాన్ ఈ దేశాలు సహా సమీప గల్ఫ్ దేశాలపైనా విరుచుకుపడింది. దీంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. చమురు, గ్యాస్ రవాణాకు అంతరాయం ఏర్పడగా.. ఇదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులు మన స్టాక్ మార్కెట్ల నుంచి విపరీతంగా పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. దిగుమతుల బిల్లు మరింత భారంగా మారింది. ఈ క్రమంలోనే కూడా భారీగా పడిపోయింది. ఒక దశలో డాలరుతో చూస్తే రూపాయి మారకం విలువ 95 మార్కును కూడా దాటి చరిత్రలో తొలిసారిగా ఈ స్థాయికి చేరింది. దీంతో తీవ్ర ఆందోళనలు నెలకొనగా.. ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని.. ఆర్బీఐ ఎంట్రీ ఇచ్చి రూపాయి పతనాన్ని అడ్డుకోవాలన్న డిమాండ్లు వినిపించాయి. ఇందులో భాగంగానే.. బ్యాంకుల నెట్ ఓపెన్ పొజిషన్లలో పరిమితులు విధించింది. రూపాయిపై స్పెక్యులేషన్ కార్యకలాపాలకు కళ్లెం వేసేలా ఆన్‌షోర్ మార్కెట్లో బ్యాంకులు రోజువారీగా 100 మిలియన్ డాలర్ల వరకే ఓపెన్ పొజిషన్స్ ఉంచుకునేలా చర్యలు తీసుకుంది. దీంతో మార్కెట్లో డాలర్ల సరఫరా పెరిగి.. రూపాయి స్థిరీకరించింది. . ఇప్పుడు ఏప్రిల్ 8న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్ని కేంద్ర బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ఇందులో భాగంగానే రూపాయి పతనంపైనా ఆయన స్పందించారు. కరెన్సీ విలువల్లో అధిక హెచ్చుతగ్గులు కనిపిస్తే మాత్రమే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి ఆందోళనా అవసరం లేదని.. జోక్యం చేసుకోబోమని చెప్పుకొచ్చారు. రూపాయి విలువను ఒక నిర్దిష్ట స్థాయి (90 లేదా 95 ఇలా) దగ్గర ఉంచడం.. తమ లక్ష్యం కాదని అన్నారు. డిమాండ్ అండ్ సప్లై మాత్రమే రూపాయి విలువను నియంత్రిస్తాయని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉందని.. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. బలమైన ఆర్థిక మూలాలు ఉన్నప్పటికీ.. అంతకుముందు ఏడాదులతో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ కాస్త ఎక్కువ మాత్రమే క్షీణించిందని మల్హోత్రా వివరించారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు సగటు విలువ 94 గా ఉండొచ్చని అంచనా వేశారు. అంతకుముందు 2025-26 రెండో అర్ధభాగంలో రూపాయి విలువ 88 వద్ద ఉండొచ్చని అంచనా వేసింది.