ఏపీలో పెన్షనర్లకు అలర్ట్.. కీలక మార్పులు.. మే నుంచి అమలు..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్ల మంజూరు ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించేందుకు, పారదర్శకతను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మే ఒకటో తేదీ నుంచి అన్ని రకాల పెన్షన్ కేసులను ద్వారా ప్రాసెస్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిజికల్ అప్లికేషన్లకు ఏప్రిల్ 30వ తేదీతో స్వస్తి చెప్పి, మే ఒకటో తేదీ నుంచి నూతన విధానాన్ని అమలు చేయనుంది. నిధి పోర్టల్ ద్వారా మాత్రమే పెన్షన్ కేసుల పరిశీలనతో పాటుగా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ (RBPS) అమలు చేయాలని ఏపీ ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పెన్షన్ల ప్రపోజల్స్‌కు సంబంధించి ప్రస్తుతం కాగితాల రూపంలో దరఖాస్తు విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే ఈ విధానంలో పెన్షన్ ప్రపోజల్స్‌ను అధికారులు అంగీకరిస్తారు. మే 1 నుంచి ఎటువంటి పేపర్ అప్లికేషన్లను స్వీకరించరు. మే ఒకటో తేదీ నుంచి పెన్షన్ దరఖాస్తులు అన్నీ కూడా ఆన్‌లైన్ విధానంలో నిధి పోర్టల్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న కాగితపు దరఖాస్తులను ఈ నెలాఖరులోపు సంబంధిత కార్యాలయాలకు అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వులలో స్పష్టం చేసింది. పెన్షన్ ప్రాసెసింగ్‌లో జాప్యాన్ని నివారించటంతో పాటుగా పారదర్శకత కోసం ఈ డిజిటల్ విధానం తీసుకువస్తున్నారు.ప్రస్తుత విధానంతో పోలిస్తే ఈ డిజిటల్ విధానంలో పెన్షనర్ ఫైల్ ఏ దశలో ఉందో ఆన్‌లైన్‌లోనే తెలుసుకునే వీలుంది. అలాగే ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు. డిజిటల్ విధానంలో వేగంగా ఆమోదం పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మధ్యవర్తుల ప్రమేయం ఉండదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు మే ఒకటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త విధానంపై అన్ని ప్రభుత్వ శాఖల హెచ్ఓడీలకు, జిల్లా అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. ఎవరైనా ఉద్యోగుల పదవీ విరమణ దగ్గర పడినట్లైతే.. అలాంటి ఉద్యోగులు రిటైర్ కావటానికి ముందే వారి పెన్షన్ వివరాలను.. నిధి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వలన సాంకేతిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు.