హైదరాబాద్ ORR సమీపంలో హైస్పీడ్ రైల్.. శంషాబాద్‌లో టెర్మినల్, 650 ఎకరాల భూకేటాయింపు

Wait 5 sec.

దేశంలో రవాణా వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు చేపడుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఎయిర్‌పోర్టులు, కొత్త రైల్వే ప్రాజెక్టులు, నేషనల్ హైవే ప్రాజెక్టులను నిర్మిస్తోంది. అందులో భాగంగానే దేశంలోని కీలక నగరాలను రైల్వే మార్గంతో కలిపేలా.. అత్యంత వేగంగా ఒక నగరం నుంచి మరో నగరానికి చేరుకునేలా.. ప్రతిష్ఠాత్మక హైస్పీడ్ రైలు ప్రాజెక్టును చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మించనున్నారు.ఇందులో భాగంగానే శంషాబాద్ మండలంలోని బహుదూర్ గూడ, రషీద్ గూడ, చిన్న గొల్కొండ ప్రాంతం ఈ హైస్పీడ్ రైలు జంక్షన్‌కు అనువుగా ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ 3 గ్రామాల పరిధిలో సుమారుగా 500 ఎకరాల భూమి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. హైదరాబాద్-బెంగళూరు.. హైదరాబాద్-పుణె, హైదరాబాద్-చెన్నై కారిడార్లలో ఈ హైస్పీడ్ రైలు పరుగులు పెడుతూ.. హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నై నాలుగు నగరాలను కలుపనుంది. ఇక ఈ 3 కారిడార్లను హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శంషాబాద్ మండలం బహదూర్‌గూడలోని సర్వే నంబర్లు 28, 62లలో 650 ఎకరాల భూమిని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ మూడు కారిడార్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 2026–27 వార్షిక బడ్జెట్లో రూ.43,848 కోట్లతో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదనలు చేసింది. ఇప్పటికే హై స్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు.. హైదరాబాద్ మెట్రో రైలును వరకు పొడిగించే ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం రెడీ చేసింది. ఈ మెట్రో రైలును కూడా కొత్తగా నిర్మించే హైస్పీడ్ రైల్ కారిడార్ జంక్షన్‌కు అనుసంధానం చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను రాష్ట్ర సర్కార్ పరిశీలిస్తుంది. హైదరాబాద్ మెట్రో రెండో దశలో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 36.8 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు సుమారుగా 40 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. రోడ్డు, రైలు, మెట్రో రైలు, ఎయిర్‌పోర్టుతో కలిపి మొత్తం 4 మార్గాలను కొత్తగా నిర్మించనున్న హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ జంక్షన్‌తో కలిపేందుకు అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.