సింహాచలం చందనోత్సవం.. భక్తుల భద్రత కోసం తొలిసారిగా ఏఐ వినియోగం..

Wait 5 sec.

సింహాచలం చందనోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. సింహాచలం అప్పన్న ఆలయంలో ఏప్రిల్ 20వ తేదీన చందనోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కూడా నేటి నుంచి ( ఏప్రిల్ 13) నుంచి ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులలో భక్తులకు నిజరూప దర్శనం టికెట్లు జారీ చేస్తున్నారు. భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. భక్తుల భద్రత కోసం సింహాచలం ఆలయంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా సింహగిరిపై భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం పరిశీలించారు. ఈ ఏడాది సుమారు 2 లక్షల మంది భక్తులు స్వామివారి నిజరూప దర్శనం కోసం వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో.. సామాన్య భక్తుల దర్శనానికి పెద్దపీట వేయనున్నట్లు అనిత తెలిపారు. ఆరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచే సింహాచలం ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు తొలిసారిగా ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు వంగలపూడి అనిత వెల్లడించారు. అలాగే ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సింహాచలం కొండపై పది చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని.. నిరంతరాయంగా మజ్జిగ, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి అనిత తెలిపారు.రద్దీ సమయాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. అత్యవసర సేవల కోసం ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఆలయం వద్ద అందుబాటులో ఉంచాలని సూచించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, స్వామివారి నిజరూప దర్శనం , ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్ు హోం మంత్రి వివరించారు. సింహాచలం చందనోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.మరోవైపు చందనోత్సవం సందర్భంగా సింహాచలంలో గంధం అరగతీత కార్యక్రమానికి శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద మంత్రాల సాక్షిగా ఈ ప్రక్రియ ప్రారంభించారు. ఆలయ ఆచారం ప్రకారం గంధం అరగతీత కార్యక్రమం మూడు రోజులు కొనసాగుతుంది. గంధం అరగతీత కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.