సైకిల్‌పై ఎన్నికల ప్రచారం.. అభిమాని చేసిన పనికి హడలిపోయిన విజయ్.. వీడియో వైరల్

Wait 5 sec.

తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. విన్నూత రీతిలో విజయ్ ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కన్యాకుమారిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన సైకిల్ తొక్కారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వైరల్ అవుతోన్న వీడియోలో తన ప్రచార వాహనం ముందు విజయ్ సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుండగా.. పెద్ద సంఖ్యలో అభిమానులు వెనుక పరుగులు తీస్తున్నారు. ఈ సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.సైకిల్ ముందు ఓ అభిమాని పూలు విసరడంతో విజయ్ ఉలిక్కిపడ్డారు. ఏమనుకున్నారో ఏమో తెలీదు కానీ విజయ్ వెంటనే సైకిల్ ఆపేయగా.. వెనుకనే ఉన్న భద్రతా సిబ్బంది పరుగులు తీస్తూ వచ్చారు. విజయ్‌తో పాటు సైకిల్‌ను వారు తీసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుండగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అది ఏఐ వీడియో అని కొందరంటే.. బాంబు విసిరాడమోనని విజయ్ భయపడి సైకిల్ దిగి వెనక్కి వెళ్లిపోయారని ఇంకొందరు అంటున్నారు. మరీ ఇంతలా భయపడితే రాజకీయాల్లో కష్టమే అంటూ కొందరు పెదవిరుస్తున్నారు. తొలిసారి ఎన్నికల్లో పోటీచేస్తోన్న విజయ్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వ్యూహాత్మకంగా ఎవరితో పొత్తుల్లేకుండా ఒంటిరిగా బరిలోకి దిగిన విజయ్.. తన పార్టీ తరఫున దాదాపు కొత్తవాళ్లకే టిక్కెట్లు ఇచ్చారు. ఇదే సమయంలో యువత, మహిళలు, రైతులే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు. తాము అధికారంలోకి వస్తే రూ.4 వేలు నిరుద్యోభృతి, పెద కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువుకు రూ.20 లక్షల సహయం చేస్తామని విజయ్ ప్రకటించారు. అలాగే స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అమలు చేస్తామన్నారు.అంతేకాదు, తమ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపడితే ఏఐ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని విజయ్‌ హామీ ఇచ్చారు. టీవీకే పాలనలో దేశానికి ఏఐ హబ్‌గా తమిళనాడు మారుతుందని జోస్యం చెప్పారు. ఏఐ యూనివర్సిటీ, ఏఐ సిటీలను కూడా ఏర్పాటు చేస్తామని టీవీకే చీ్ పేర్కొన్నారు. అవినీతి, లంచగొండితనం లేకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా.. తమిళనాడులో ఆధార్‌ తరహా గుర్తింపు కార్డు తెస్తామని చెప్పారు.