వేసవి సీజన్‌లో రైళ్లల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక చర్యలు చేపడుతోంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ వేసవిలో తిరుపతి, చర్లపల్లి. సికింద్రాబాద్, కాచిగూడ, కాకినాడ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.వేసవిలో తిరుపతికి ప్రత్యేక రైళ్లుతిరుపతి - అకోలా (07605) మధ్య ఏప్రిల్ పదో తేదీ, అలాగే అకోలా - తిరుపతి (07606) మధ్య ఏప్రిల్ 12న ప్రత్యేక రైలు నడుపుతున్నారు. తిరుపతి - చర్లపల్లి మధ్య 07000, 07002 నంబర్లతో ఏప్రిల్ 14, ఏప్రిల్ 16వ తేదీలలో.. అలాగే చర్లపల్లి - తిరుపతి మధ్య 07001, 07031 నంబర్లతో ఏప్రిల్ 15, ఏప్రిల్ 17వ తేదీలలో ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. తిరుపతి - నర్సాపురం రైలు (07131) ఏప్రిల్ 12న, నర్సాపురం - తిరుపతి రైలు (07132) ఏప్రిల్ 13వ తేదీన అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, నర్సాపురానికి ప్రత్యేక రైళ్లు మరోవైపు సికింద్రాబాద్ - అనకాపల్లి రైలు(07055) ఏప్రిల్ 16, అనకాపల్లి - సికింద్రాబాద్ రైలు (07056) ఏప్రిల్ 17వ తేదీలలో అందుబాటులో ఉంటుంది. చర్లపల్లి - నర్సాపురం, నర్సాపురం - చర్లపల్లి మధ్య ఏప్రిల్ 11, 12వ తేదీలలో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. కాకినాడ - లింగంపల్లి రూట్‌లో ఏప్రిల్ 10, 13, 15వ తేదీలలో.. లింగంపల్లి - కాకినాడ మధ్య ఏప్రిల్ 11, 14, 16వ తేదీలలో ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కాకినాడ - చర్లపల్లి, చర్లపల్లి - కాకినాడ మధ్యన ఏప్రిల్ 11, 12వ తేదీలలో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అలాగే చర్లపల్లి - అనకాపల్లి, అనకాపల్లి - చర్లపల్లి రైళ్లు ఏప్రిల్ 11, 12 తేదీలలో అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ - అనకాపల్లి, అనకాపల్లి - సికింద్రాబాద్ మార్గంలో ఏప్రిల్ 12, 13వ తేదీలలో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. కాకినాడ మైసూరు ప్రత్యేక రైలు (07033) ఏప్రిల్ 10, ఏప్రిల్ 13వ తేదీలలో నడవనుంది. అలాగే మైసూరు - కాకినాడ మధ్య ఏప్రిల్ 11, 14న ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ధర్మవరం - నాందేడ్, నాందేడ్ - ధర్మవరం మధ్య ఏప్రిల్ 10,12వ తేదీలలో ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు.