TDS New Form: ఈ నెల నుంచే అమలులోకి వచ్చింది. ఇందులో కీలక మార్పులు చేశారు. ఇన్‌కమ్ ట్యాక్స్‌కు సంబంధించిన సెక్షన్లు, ఫారాలను భారీగా తగ్గించారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా ఉన్న ఆదాయపు పన్ను చట్టంలో మొత్తం 399 ఫారాలు ఉండగా వాటిని కొత్త చట్టంలో 190కి కుదించారు. ఇందులో భాగంగానే కొత్త ఫారం 121ను పరిచయం చేశారు. ఆదాయం ఉన్న వారు పన్ను తప్పించుకునేందుకు ఈ ఫారం ఉపయోగించాల్సి ఉంటుంది. గతంలో ఈ విషయంలో కొంత గందరగోళం ఉండేది. కానీ, ఇప్పుడు ఎలాంటి గందరగోళం లేకుండా చేశారు. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం డిపాజిటర్లు ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS)తప్పించుకునేందుకు లేదా 15హెచ్ బ్యాంకుకు సమర్పించాల్సి ఉండేది. అయితే, ఏ ఫారం ఎవరు ఉపయోగించాలని కొంత గందరగోళం ఉండేది. ఇప్పుడు ఆ రెండు ఫారాలను విలీనం చేసి ఒకే ఫారం తీసుకొచ్చారు. అదే ఫారమ్ 121. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 కింద ఈ మార్పులు చేశారు. ఈ ఫారం ఉపయోగించి ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన వారు, మ్యూచువల్ ఫండ్స్, డివిడెండ్ల ఆదాయం పొందుతున్న వారు టీడీఎస్ తప్పించుకోవచ్చు. సీనియర్ సిటిజన్ అయినా ఇదే ఫారం ఉపయోగించాల్సి ఉంటుంది. ఎలాంటి ఆదాయాలకు ఇవ్వాలి? వ్యక్తిగతంగా తమ సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేందుకు ఈ ఫారం 121 ఉపయోగించాలి. బ్యాంకి డిపాజిట్లు, పోస్టాఫీస్ డిపాజిట్లు, పీఎఫ్ ఉపసంహరణ, పెన్షన్, ఇన్సూరెన్స్ కమీషన్, రెంటు, డిపాజిట్లపై వచ్చే వడ్డీ, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే ఆదాయం, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, డివిడెండ్ల ద్వారా చెల్లించే పేమెంట్లకు ఈ ఫారం వర్తిస్తుంది. ఎవరు అర్హులు?భారతీయ పౌరులు ఎవరైనా 60 ఏళ్లలోపు లేదా 60 ఏళ్ల పైన ఉన్నవారు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ఇతర ప్రత్యేక సంస్థలు ఈ టీడీఎస్ ఉపయోగించి ట్యాక్స్ తప్పించుకోవచ్చు. అయితే, కంపెనీలు, ఇతర సంస్థలు ఈ ఫారం 121 ఉపయోగించేందుకు లేదు. అలాగే నాన్-రెసిడెంట్ ఇండియన్స్ సైతం ఈ ఫారం ఉపయోగించేందుకు అర్హత ఉండదు. అయితే వడ్డీ ఆదాయం చెల్లించక ముందే ఈ ఫారాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన క్రమంలో ఇప్పుడు ఇచ్చేందుకు సరైన సమయంగా చెప్తారు.