SBI నుంచి మరో 2 కొత్త స్కీమ్స్.. ఈనెల 15 నుంచే షురూ.. కనీస పెట్టుబడి ఎంతంటే?

Wait 5 sec.

Alert: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతి నెల కోట్లాది రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చాయి. గత మార్చి నెలలోనే రూ.40 వేల కోట్లకు పైగా కొత్తగా ఇన్వెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లోకి వచ్చాయి. ఈ క్రమంలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మూలధన లాభాలను అందించేందుకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు న్యూ ఫండ్ ఆఫర్ తో వస్తున్నాయి. ఈ వారం మొత్తం 4 కొత్త ఫండ్స్ లాంచ్ అవుతున్నాయి. అందులో రెండు లాంగ్-షార్ట్ ఫండ్స్ ఉన్నాయి. వీటి సబ్‌స్క్రిప్షన్ ఏప్రిల్ 15వ తేదీ నుంచే మొదలవుతోంది. తమ ఫోర్ట్ ఫోలియోలని ఖాళీలను పూరించడంతో పాటు దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించేలా కొత్త ఫండ్స్ ను ఫండ్ హౌస్‌లు లాంచ్ చేస్తున్నాయి. వాటి గురించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. ఎస్‌బీఐ నుంచి 2 కొత్త స్కీమ్స్.. () నుంచి రెండు కొత్త ఫండ్స్ ఉన్నాయి. ఎస్‌బీఐ క్రిసిల్ ఐబీఎక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3-6 మంత్స్ డెట్ ఇండెక్స్ ఫండ్ (SBI CRISIL-IBX Financial Services 3-6 Months Debt Index) లాంచ్ అవుతోంది. ఈ స్కీమ్ సబ్‌స్క్రిప్షన్ ఏప్రిల్ 15వ తేదీన మొదలై ఏప్రిల్ 20వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5000గా నిర్ణయించారు. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక రెండో స్కీమ్ ఎస్‌బీఐ క్రిసిల్ ఐబీఎక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 9-12 మంత్స్ డెట్ ఇండెక్స్ ఫండ్ (SBI CRISIL-IBX Financial Services 9-12 Months Debt Index) సబ్‌స్క్రిప్షన్ ఏప్రిల్ 15వ తేదీన మొదలవుతోంది. ఏప్రిల్ 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.5000గా నిర్ణయించారు. ఆ తర్వాత రూ.5 వేల చొప్పున ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. 2 SIF స్కీమ్స్ఇందులో డబ్ల్యూఎస్ఐఎఫ్ ఈక్విటీ ఎక్స్ టాప్ 100 లాంగ్ షార్ట్ ఫండ్ (WSIF Equity Ex-Top 100 Long Short Fund) ఏప్రిల్ 15వ తేదీన లాంచ్ అయి ఏప్రిల్ 29వ తేదీ వరకు ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.10 లక్షలుగా ఉంది. ఇక రెండోదీ డబ్ల్యూఎస్ఐఎఫ్ ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ ఏప్రిల 15న మొదలై ఏప్రిల్ 29వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులోనూ కనీస పెట్టుబడి రూ.10 లక్షలుగా నిర్ణయించారు.