Diesel Price: ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో కేంద్రం పిడుగు లాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో దేశీయంగా పన్నుల పెంపునకు తెరలేపింది. ఈ మేరకు కొత్త గెజిట్ నోటిఫికేషన్ శనివారం రాత్రి విడుదల చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఏప్రిల్ 11, 2026 నుంచే అమలులోకి వచ్చినట్లు తెలిపింది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం హైస్పీడ్ డీజిల్ ఎగుమతులపై ఎక్స్‌పోర్ట్ సుంకాలను రూ. 55.5 మేర పెంచింది. ప్రస్తుతం ఈ పన్నుల బాదుడు లీటరుకు రూ. 21.5గా ఉండగా దానిని రెండింతలకు పైగా చేసింది. విమాన ఇంధనంపైనా బాదుడుహైస్పీడ్ డీజిల్‌ ఎగుమతి సుంకాల పెంపుతో పాటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ పైనా ఎక్స్‌పోర్ట్ డ్యూటీని పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఏటీఎఫ్ ఇంధనంపై లీటరుకు రూ. 42 మేర ఎక్స్‌పోర్ట్ డ్యూటీ వసూలు చేయనున్నారు. ఇప్పటి వరకు అది లీటరుకు రూ. 29.5గా ఉండగా రూ. 42కు పెంచారు. సవరించిన సుంకాలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపింది. రూపంలో ప్రభుత్వ ఖజానాకు మళ్లించే ఉద్దేశంతో విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ ను కేంద్రం విధిస్తోంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పుడు దేశీయ రిఫైనరీలు విదేశఆలకు ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను అందుకుంటాయి. ఈ అదనపు లాభాలపై పన్ను విధించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకోవడం ఒక లక్ష్యం. ఇక రెండోది దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా చూడటం. ఎగుమతులపై సుంకాలు పెంచడం వల్ల కంపెనీలు విదేశాలకు పంపడం కంటే దేశీయ మార్కెట్ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, రోస్ నెఫ్ట్ మద్దతు గల నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రంగ చమురు శుద్ధి కర్మాగారాలపై ప్రభావం పడనుంది. ఎగుమతుల ద్వారా వచ్చే లాభాల్లో కొంత మేర పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ సుంకాల పెంపు అనేది కేవలం విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనానికే వర్తిస్తుంది. కాబట్టి దేశీయంగా సామాన్య ప్రజలు కొనుగోలు చేసే పెట్రోల్, డీజిల్ ధరలపై దీని ప్రభావం ఉండదు.