Market Rally: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్- అమెరికా మధ్య యితే, ఈరోజు ఐటీ సెక్టార్‌లోని పెద్ద పెద్ద కంపెనీల షేర్లన్నీ నష్టాలను మిగల్చడం ఇన్వెస్టర్లను కొంత ఆందోళనకు గురి చేసింది. అదే సమయంలో బ్యాంకింగ్ రంగం నుంచి లభించిన మద్దతు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో ఈరోజు భారతీ సూచీలు రాణించాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స 919 పాయింట్లు పెరిగింది. ఈరోజు ట్రేడింగ్ విషయాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 10వ తేదీన ఉదయం 77,121 పాయింట్ల వద్ద లాభాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఇంట్రాడేలో ఒక దశలో 100 పాయింట్ల వరకు పెరిగి 77,622 వద్ద గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. చివరకు 919 పాయింట్ల లాభందో 77,550 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 50 ఇండెక్స్ 23,880 పాయింట్ల వద్ద లాభాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టింది. మార్కెట్లు ముగిసే నాటికి 276 పాయింట్ల లాభంతో 24,050 వద్ద ముగిసింది. మళ్లీ 24 వేల పాయింట్ల మార్క్ దాటింది. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్స్, ఐషర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో వంటి షేర్లు 3 శాతానికిపైగా లాభపడ్డాయి. అయితే, కోల్ ఇండియా, సన్ ఫార్మా షేర్లు 3.50 శాతానికిపైగా నష్టపోయాయి. అలాగే ఐటీ రంగంలోని దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. ఇన్ఫోసిస్ 2.94 శాతం నష్టపోగా టీసీఎస్ షేరు ధర 2.50 శాతం పతనమైంది. ఇక టెక్ మహీంద్రా షేర్లు 1.46 శాతం మేర పడిపోయాయి. మరోవైపు.. బ్యాంకింగ్ షేర్లలో భారీ కొనుగోళ్లే ఈరోజు మార్కెట్లు భారీ లాభాలు అందుకునేందుకు ప్రధాన కారణంగా ఈక్విటీ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కొస్పి సహా పలు ఆసియా మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు బలం చేకూరినట్లయింది. అలాగే ఒక దశలో రూపాయి సైతం కాస్త కోలుకోవడం కలిసొచ్చింది. అన్ని వైపుల నుంచి సానుకూల సంకేతాలు అందిన క్రమంలో దేశీయ మార్కెట్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది.