నల్లమల్ల అడవిలో కార్చిచ్చు.. మహానంది చుట్టుపక్కల పరిసరాల్లో మంటలు..

Wait 5 sec.

విస్తరిస్తోంది. నంద్యాల జిల్లా మహానంది మండలంలోని మహానంది ఆలయంతో పాటు.. పరిసరాల్లో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో మంటలు కొనసాగుతున్నాయి. బుధవారం రోజు రాత్రి దయ్యాలతిప్ప, మోకాళ్ళ తిప్ప, మోటు ప్రదేశాల్లోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మరోవైపు విస్తరిస్తున్న మంటలను అదుపు చేయడానికి అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నల్లమల అడవిలో కార్చిచ్చుతో అడవిలోని వన్యప్రాణాలు ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు నల్లమల అడవిలో కార్చిచ్చు ఆపాలంటే.. హెలికాప్టర్ ద్వారా నీటిని చల్లితేనే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మార్చి నెల మధ్యలోనూ ఇదే తరహాలో నల్లమల అడవిలో కార్చిచ్చు చెలరేగింది. మహానంది ఆలయం వెనుక ఉన్న అడవిలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే అధికారులు సకాలంలో స్పందించి మంటలను నియంత్రించారు. వేసవి కాలం కావడంతో నల్లమల అడవిలో ఎండిపోయిన చెట్లు, ఆకులు అధికంగా ఉన్నాయి. దీంతో చిన్నగా చెలరేగే మంటలు.. కార్చిచ్చుగా మారే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ కార్చిచ్చుల కారణంగా అడవిలోని వన్యప్రాణులు ఇబ్బందులు పడుతున్నాయి. నల్లమల అడవి పులులు, చిరుతలు, అడవి పందులు, జింకలు, కుందేళ్లు వంటి జంతువులకు ఆవాసంగా ఉంది. అయితే కార్చిచ్చుల కారణంగా ఈ వన్యప్రాణుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దీనికి తోడు నల్లమల అడవిలో ఔషధ గుణాలు కలిగిన చెట్లు, మొక్కలు వంటి వనసంపద అధికం. ఈ కార్చిచ్చుల కారణంగా ఇలాంటి అరుదైన వనసంపదకు ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగకుండా అటవీ శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు, జంతుప్రేమికులు కోరుతున్నారు. ప్రస్తుతం చెలరేగిన కార్చిచ్చును వీలైనంత త్వరగా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒక్కోసారి మానవ నిర్లక్ష్యంగా కారణంగా కూడా మంటలు చెలరేగుతున్నాయని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీ శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.