ఇరాన్‌తో కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసి 24 గంటలైనా కాలేదు పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు స్పందనగా అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. ఇరాన్, అమెరికాలు రెండు వారాల కాల్పుల విరమణపై బుధవారం తెల్లవారుజామున ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రపంచ చముర సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధిని తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. ఇరాన్‌తో కాల్పుల విరమణకు అమెరికా తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బహిరంగంగా మద్దతు తెలిపారు, కానీ ఆ ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చలేదని చెప్పారు. జరిగిన విషయం తెలిసిందే.‘‘ఇరాన్ తక్షణమే జలసంధి తెరిచి, అమెరికా, ఇజ్రాయెల్, ఈ ప్రాంతంలోని దేశాలపై అన్ని దాడులను నిలిపివేస్తే.. ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేయాలన్న అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతు ఇస్తుంది.. రాబోయే చర్చలలో అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ మిత్రదేశాలు పంచుకునే ఈ లక్ష్యాలను సాధించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఇజ్రాయెల్‌కు అమెరికా చెప్పింది. ఈ రెండు వారాల కాల్పుల విరమణలో లెబనాన్‌ను చేర్చలేదు’’ అని బెంజిమిన్ నెతన్యాహు ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. ట్రంప్ సహకారం చాలా గొప్పదని, ఆయనతో సంబంధాలు బలంగా ఉన్నాయని నెతన్యాహు పేర్కొన్నారు. అంతేకాదు, హెజ్బొల్లాపై దాడులను కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.లెబనాన్‌‌లో హజ్బెల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ బుధవారం కూడా భీకర దాడులను కొనసాగించింది. ఈ దాడుల్లో 112 మంది మరణించగా, 837 మంది గాయపడ్డారు. దీనిపై ఇరాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ ప్రకటన చేసినా లెబనాన్‌ను ఇప్పటికీ లక్ష్యంగా చేసుకోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇస్తూ.. ‘అవును, ఆ ఒప్పందంలో లెబనాన్ లేదు’ అని అన్నారు. హెజ్బొల్లా కారణంగా వారిని ఒప్పందంలో చేర్చలేదని, దాని గురించి కూడా చూసుకుంటామని ట్రంప్ అన్నారు. పాకిస్థాన్ వేదికగా ఏప్రిల్ 10న ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్న సంగతి తెలిసిందే.