పుట్టినరోజు వేళ అనంత్ అంబానీ గొప్ప మనసు.. ఆవుల కోసం రూ. 10 కోట్లు విరాళం.. గజరాజులకు విందు!

Wait 5 sec.

: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో కుమారుడు.. రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ అయిన మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. . ఇప్పుడు మరోసారి అదే పని చేశారు. ఏప్రిల్ 10న 31వ ఏట అడుగుపెడుతున్న అనంత్ అంబానీ.. దానికి ముందు ఒక మంచి పని చేశారు. గుజరాత్‌ సాలంగ్‌పూర్‌లోని కష్టభంజన్ దేవ్ హనుమాన్‌జీ ఆలయానికి రూ. 10 కోట్ల విరాళం ప్రకటించారు. ఇక్కడ ఆయన సహాయం.. ఆవుల సంరక్షణ, సంక్షేమం కోసం కావడం విశేషం. ఈ మొత్తాన్ని ఆవుల కోసం అత్యాధునిక గోశాల నిర్మాణానికి వినియోగించనున్నారు. సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో స్వీడన్‌ సంస్థ డెలావల్ సహకారంతో.. అంతర్జాతీయ ప్రమాణాలతో గోశాలను నిర్మిస్తున్నారు. ఇక్కడ సుమారు 500 వరకు ఆవులు వసతి పొందేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టును అంబానీ కుటుంబమే చూసుకుంటోంది. ఏకైక దాతగా వీరే ఉన్నారు. అనంత్ అంబానీకి మూగజీవాల పట్ల విపరీతమైన ప్రేమ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా ఆవుల కోసం తన పుట్టినరోజుకు ముందు విరాళం ఇచ్చి మరోసారి ప్రేమను చాటుకున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్‌ జైపూర్ శివార్లలో హాథీ గావ్‌లో అనంత్ అంబానీ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. వన్యప్రాణుల కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా హాథీ గావ్ వికాస్ సమితి వినూత్నంగా వేడుకను నిర్వహించింది. ఇందులో భాగంగా ఏనుగుల కోసం ఇక్కడ అరటిపండ్లు, చెరకు, బెల్లం, పుచ్చకాయలు, ఆపిల్స్, బొప్పాయి ఇలా దాదాపు 3 వేల కిలోల పండ్లతో భారీ బఫే ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఇంకా బాబు, చంద, పుష్ప అనే 3 ఏనుగులు.. వాటి తొండాలతో అనంత్ అంబానీ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక వేడుక కోసం దాదాపు 100 ఏనుగుల్ని రాజస్థానీ సంప్రదాయ పద్ధతిలో రంగురంగుల దుస్తులు, ఆభరణాలతో అలంకరించినట్లు తెలిసింది. ముంబైలోని ఐకానిక్ బాంద్రా- వర్లీ సీ లింక్ ఒక భారీ డిజిటల్ క్యాన్వాస్‌గా మారి అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఇక్కడ వంతెనపై అనంత్ అంబానీ చిత్రాన్ని.. హ్యాపీ బర్త్ డే అనంత్ అంబానీ జీ అనే సందేశాన్ని లేజర్ ప్రొజెక్టర్లతో ప్రదర్శించారు. ఈ వంతెన మొత్తం బంగారు వర్ణపు వెలుగులతో నిండిపోయింది. చూపరుల్ని ఆకట్టుకుంటుంది. . రాజరాజేశ్వర ఆలయం కోసం రూ. 15 కోట్లు ప్రకటించారు. రూ. 3 కోట్లు తక్షణమే చెక్ రూపంలో అందించగా.. వందల ఏళ్ల చరిత్ర ఉన్న తూర్పు గోపురం పునర్నిర్మాణం కోసం మరో రూ. 12 కోట్లు ప్రకటించారు. ఇంకా గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయానికి రూ. 3 కోట్లు అందించారు. ఆలయ అభివృద్ధి సహా ఆలయ ఏనుగులకు అత్యాధునిక ఆస్పత్రి నిర్మాణం కోసం దీనిని వినియోగించనున్నారు.ఇవే కాకుండా అనంత్ అంబానీ.. గుజరాత్‌ జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్‌ లోపల దాదాపు . ఇక్కడ గాయపడిన, అనాథలైన లేదా దాడులకు గురైన జంతువులకు పునరావాసం కల్పించేందుకు ఉద్దేశించింది. ఇక్కడ అత్యాధునిక ఏనుగుల ఆస్పత్రి కూడా ఉంది.