భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ - సంగీత దర్శకుడు ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. ఇంకొద్ది గంటల్లో తాళి కట్టబోతున్నారు అనగా ఒక్కసారిగా పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత ఇద్దరికీ బ్రేకప్ అయిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారా? అన్న ప్రశ్న సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దానికి కారణం నెట్టింట వైరల్ అవుతోన్న ఓ ఫ్యామిలీ వీడియోనే!టీమిండియా ఉమెన్స్ జట్టు వరల్డ్‌కప్ 2025 గెలిచిన కొద్ది రోజుల్లోనే స్మృతి మంధాన - పలాష్ ముచ్చల్ వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే చివరి నిమిషంలో పెళ్లి అనూహ్యంగా వాయిదా పడింది. మొదట పెళ్లి వాయిదాకు స్మృతి మంధాన తండ్రి అనారోగ్యమే కారణమనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో పలాష్ ముచ్చల్‌పై అనేక రూమర్స్ వచ్చాయి. స్మృతి మంధానను మోసం చేశాడంటూ ఏవేవో నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ వాటన్నింటినీ పలాష్ కుటుంబం ఖండించింది. వివాహం వాయిదా పడిన తర్వాత తమ రిలేషన్ కూడా ముగిసిందంటూ స్మృతి మంధాన - పలాష్ ముచ్చల్ అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఒక స్టేట్‌మెంట్ కూడా పాస్ చేశారు. దీనిపై ఎవ్వరూ అనవసర రాద్దాంతం చేయొద్దంటూ అప్పట్లో వీళ్లిద్దరూ కోరారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ముంబైలో ఉన్న ఓ రెస్టారెంట్ బయట మంధాన తండ్రి శ్రీనివాస్, పలాష్ సోదరి పలక్ ముచ్చల్-భర్త మిథూన్ కనిపించారు. పలక్ ముచ్చల్ శ్రీనివాస్ కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవడంతో నెటిజన్లు తమకు నచ్చినట్లు ఊహించుకున్నారు. ఇరు కుటుంబాలు దగ్గరయ్యారని, త్వరలోనే పెళ్లి జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. కానీ ఈ వీడియో పాతదా? లేక ఇప్పటిదేనా? అన్న క్లారిటీ ఎవ్వరికీ లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో గురించి ఇరు కుటుంబసభ్యులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దాంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటన వచ్చే వరకూ నెటిజన్లు ఊహాగానాలు హద్దులు లేకుండా పోవడం ఖాయం.