, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభానియా పార్లమెంటుకు చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అనర్హులు కలిగి ఉన్న రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియను ముమ్మరంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ విజిలెన్స్ విభాగం.. గుట్టు చప్పుడు కాకుండా.. రేషన్ కార్డులకు సంబంధించి రహస్య ఆడిట్ నిర్వహించగా అందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోనే ఏకంగా 2 లక్షల మంది అనర్హులు కలిగి ఉన్నారని తేలింది. పాన్ కార్డు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) నంబర్లను రేషన్ కార్డు డేటాతో విజిలెన్స్ అధికారులు లింక్ చేయగా.. కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే దాదాపు 2 లక్షల మంది ఆదాయపు పన్ను (ఇన్‌కం ట్యాక్స్) చెల్లించే వారు రేషన్ కార్డులను పొందినట్లు వెల్లడైంది. దీనికి సంబంధించి ఇప్పటికే 80 శాతం వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఐటీ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగుల రేషన్ కార్డులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాఫ్ట్‌వేర్‌తో విజిలెన్స్ అధికారులు గుర్తించడం గమనార్హం.మరోవైపు.. అనర్హులుగా తేలిన వారి రేషన్ కార్డులను రద్దు చేయడంపై ఇప్పుడు అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే కేవలం రేషన్ కార్డులను రద్దు చేయడం మాత్రమే కాకుండా వారు పొందిన సబ్సిడీని కూడా తిరిగి వసూలు చేసేలా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు రేషన్ కార్డులు పొందిన అనర్హుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా రేషన్ కార్డులను జారీ చేసింది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో 15 లక్షల కంటే ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలె గణాంకాలు విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణలో 17,348 రేషన్ దుకాణాలు ఉండగా.. వాటి నుంచి నెలకు 1.05 కోట్ల రేషన్ కార్డు దారులకు సరుకులు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. వీటిలో 99,36,073 ఫుడ్ సెక్యూరిటీ కార్డులు కాగా.. మరో 5,66,660 అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉన్నాయని పేర్కొంది. 5146 అన్నపూర్ణ కార్డులు కూడా ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.