‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ప్రేమ ప్లేస్‌లో నిన్నుకోరి హీరోయిన్.! ప్రేమే కావాలంటోన్న సీరియల్ ఫ్యాన్స్

Wait 5 sec.

వార్నీ.. నుంచి మన ప్రేమని () తప్పిస్తున్నారా? తప్పించడం కాదు.. ఆమే తప్పుకుంటుందట. ఈ వార్త ఇప్పుడు కాదు.. షూటింగ్ సెట్‌లో గుప్పుమన్నప్పుడే . ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో ప్రేమగా మెప్పిస్తున్న కన్నడ బ్యూటీ లావణ్య భరద్వాజ్ (Lavanya Bhardwaj) నెల తప్పడంతో ఆ సీరియల్ నుంచి తప్పుకుందట. అయితే ప్రేమ ప్లేస్‌లో నిన్నుకోరి సీరియల్ ఫేమ్ అక్షిత దేశ్‌పాండే () రాబోతుందనేది తాజా సమాచారం. ప్రేమ అలియాస్ లావణ్య మూడేళ్ల క్రితం కన్నడ సీరియల్ నటుడు శశి హెగ్డే (Shashi Hegde)ని ప్రేమించి పెళ్లాడింది. లావణ్య, శిశిల జంటకి కన్నడ బుల్లితెర వర్గాల్లో మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి సీరియల్స్ చేయడమే కాకుండా.. పలు యాడ్ ఫిల్మ్స్‌లో కూడా చేశారు. ఇక సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉంటారు ఈ జంట. అయితే పెళ్లైన మూడేళ్ల తరువాత ప్రేమ (లావణ్య) నెల తప్పడంతో కొన్నాళ్ల వరకూ యాక్టింగ్‌కి దూరం కాబోతుంది. శ్రీరస్తు శుభమస్తు సీరియల్‌తో తెలుగు టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లావణ్య.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌తో క్రేజ్ దక్కించుకుంది. రామరాజు-వేదవతిల కోడలిగా.. ధీరజ్ భార్యగా.. నర్మద చెల్లెలిగా.. భద్రావతి మేనకోడలిగా అత్తింటి కోసం ఏ త్యాగానికైనా సిద్దపడే ఉత్తమ ఇల్లాలుగా ఈ సీరియల్‌లో తన అద్భుతనటనతో మెప్పిస్తుంది ప్రేమ. ముఖ్యంగా ధీరజ్ పక్కన చాలా క్యూట్‌గా అనిపిస్తుంది. ధీరజ్, ప్రేమల జోడీ బెస్ట్ కపుల్‌గా అవార్డు కూడా అందుకున్నారు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో. ఇక నర్మదతో ప్రేమ బాండింగ్ చూస్తే.. అబ్బా తోడికోడళ్లు అంటే ఇలా ఉండాలి అనేంతగా ప్రేమ, నర్మదలు కనిపిస్తారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉంటారు. తమ భర్తలకు కూడా తెలియని రహస్యాలు వీళ్లిద్దరి మధ్యే ఉంటాయి. ఎవరికి కష్టం వచ్చినా కూడా ఒకరికొకరు నిలబడిపోతారు. ప్రేమ అంటే నర్మద.. నర్మద అంటే ప్రేమ అన్నట్టుగా భలే సెట్టయ్యారు వీళ్లిద్దరూ. అయితే ఇప్పుడు ప్రేమ ప్లేస్‌ని నిన్నుకోరి సీరియల్ ఫేమ్ అక్షిత రీప్లేస్ చేస్తుందా అంటే.. ధీరజ్‌కి జోడీగా ప్రేమ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. ఈ పొట్టిపిల్ల భలే క్యూట్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా నవ్వితే ముందు కనిపించే ఆ రెండు పళ్లు ఆమె క్యూట్‌నెస్‌ని రెట్టింపు చేస్తాయి. ఇక నర్మద, ప్రేమల మధ్య బాండింగ్ అయితే సీరియల్‌కే హైలైట్. కాబట్టి.. ప్రేమ ప్లేస్‌ని రీప్లేస్ చేయడం అంటే కాస్త రిస్కే. ప్రేమ క్యారెక్టర్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫ్యాన్స్‌లో నాటుకునిపోయింది కాబట్టి.. వేరే కొత్త క్యారెక్టర్‌తో రీప్లేస్ చేసినా.. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి కాస్త టైమ్ పట్టకతప్పదు మరి. ప్రస్తుతం కథనం కూడా ప్రేమ చుట్టూనే నడుస్తుంది. శ్రీవల్లిని చందు ఇంట్లో నుంచి గెంటేయడంతో.. వాళ్లిద్దర్నీ కలపడానికి పథకం రచించింది భాగ్యం. చందుకి డమ్మీ యాక్సిడెంట్ చేయిస్తే.. ఆ వంకతో శ్రీవల్లిని అత్తవారింటికి పంపించొచ్చని భాగ్యం ప్లాన్ వేసింది. అయితే చివరి నిమిషంలో ప్రేమ తండ్రి సేనాపతి సీన్‌లోకి వచ్చి డమ్మీ యాక్సిడెంట్ కాస్తా రియల్ అయ్యేట్టు చేస్తాడు. లారీ డ్రైవర్‌కి డబ్బులిచ్చి చందుని నిజంగానే చంపేయమని చెప్తాడు. సరిగ్గా లారీ గుద్దే టైమ్‌కి ప్రేమ అడ్డుగా వెళ్లి అతన్ని కాపాడుతుంది. ఆ ప్రమాదంలో ప్రేమ గాయాలతో హాస్పిటల్ పాలైంది. అయితే ఆ యాక్సిడెంట్ చేయించింది తానేనని సేనాపతి పశ్చాత్తాప పడతాడు. అటు ప్రేమని అసహ్యించుకుంటున్న ధీరజ్.. ఈ యాక్సిడెంట్‌పై ఆమెకి దగ్గరయ్యాడు. ప్రేమ, ధీరజ్‌ ప్రేమ పెళ్లి కూడా ఊహించని మలుపులతో సాగింది. వీళ్లిద్దరూ సొంత బావా మరదల్లే అయినా కూడా ఒకరంటే ఒకరికి పడదు. అయితే ప్రేమ.. ప్రేమపేరుతో మోసం చేసి ఆమె పెళ్లికి ముందురోజులు నగలు, డబ్బుతో లేపుకుని వెళ్లిపోతాడు ప్రియుడు కళ్యాణ్. అయితే అతని మోసగాడు అని తెలుసుకున్న ప్రేమ అతని నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. అయితే ఆమెను పోలీసులకు వ్యభిచారం కేసులో ఇరికించాలని చూస్తాడు కళ్యాణ్. ఆ టైమ్‌లో ప్రేమకి కాపాడటం కోసం వేదవతి.. ధీరజ్, ప్రేమలకు పెళ్లి చేస్తుంది. ఆ విషయం నర్మదకి కూడా తెలుసుకానీ.. ఎవరికీ చెప్పరు. పెళ్లి తరువాత ధీరజ్, ప్రేమల మధ్య ప్రేమ కథ మొదలుకావడం.. సరిగ్గా వీళ్లు కలుస్తారు అనుకున్నటైమ్‌లో శ్రీవల్లి చిచ్చు పెట్టడం.. వాళ్లు మళ్లీ దూరం అవ్వడంతో వీళ్ల ప్రేమకథ సా...గుతూ ఉంది.