IT Stocks: భారత స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపరకు తెరపడింది. వరుసగా 5 సెషన్లు సూచీలు మంచి లాభాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కిందటి రోజు ఏప్రిల్ 8న ఇరాన్- అమెరికా కాల్పుల విరమణ నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన జోష్‌తో.. స్టాక్ మార్కెట్లు భారీగా పెరిగాయి.ఇవాళ (ఏప్రిల్ 9న) మళ్లీ సీన్ రివర్స్ అయింది. సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం వార్త రాసే సమయంలో మధ్యాహ్నం 1.30 గంటలకు సెన్సెక్స్ 850 పాయింట్ల నష్టంతో 76,700 స్థాయిలో ఉండగా.. నిఫ్టీ 200 పాయింట్లు తగ్గి 23,780 వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ పలు హెవీ వెయిట్ స్టాక్స్ నిన్న పుంజుకున్నవి ఎస్బీఐ, రిలయన్స్, ఎల్ అండ్ టీ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్ఎం ఇలా అన్నీ భారీగా పడిపోయాయి. అయినప్పటికీ భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ స్టాక్ మాత్రం.. గురువారం రోజు మార్కెట్లు భారీగా పడిపోతున్నా రాణిస్తోంది. కిందటి రోజు రూ. 2559.20 వద్ద ముగిసిన టీసీఎస్ షేరు.. ఇవాళ ఆరంభంలో స్వల్ప నష్టాలతో మొదలైంది. అయితే తర్వాత పుంజుకుంది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఒక దశలో దాదాపు 2 శాతం వరకు పెరిగి రూ. 2605 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం 1.50 శాతం లాభంతో రూ. 2600 స్థాయిలో ఉంది. టీసీఎస్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 9.37 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 3,630.50 గా ఉండగా.. కనిష్ఠ ధర రూ. 2,346.20 గా ఉంది. ఇటీవల కొత్త కొత్త ఏఐ టూల్స్ రాకతో ఐటీ కంపెనీల ఆదాయాలు తగ్గుతాయన్న భయాలతో ఐటీ స్టాక్స్ భారీగా పడిపోయాయి. పశ్చిమాసియా యుద్ధం మరింత ప్రభావం చూపింది. ఇప్పుడు యుద్ధం ముగుస్తుందన్న సంకేతాలతో మళ్లీ పుంజుకుంటున్నాయి. ఇవాళ మార్కెట్లు పడుతున్నా.. టీసీఎస్ స్టాక్ రాణించేందుకు మరో కారణం ఉంది. ప్రకటించనుంది. ఇటీవల డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనం కాగా.. ఇది టీసీఎస్ ఆదాయాన్ని పెంచుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. కొనుగోళ్లు పెరగ్గా.. స్టాక్ అదే స్థాయిలో దూసుకెళ్తోంది. సాధారణంగా ఫలితాల సమయంలో స్టాక్స్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. టీసీఎస్ వంటి భారత ఐటీ కంపెనీలు ప్రధానంగా ఆదాాయాన్ని అమెరికన్ డాలర్లలో పొందుతుంటాయి. ఇటీవల డాలర్ విలువ పెరిగి.. రూపాయి విలువ తగ్గగా.. దానికి తగ్గట్లుగా టీసీఎస్ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. సంస్థ క్యూ3 ఫలితాల విషయానికి వస్తే నికర లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 14 శాతం వరకు తగ్గి రూ. 10,657 కోట్లుగా నమోదైంది. ఆదాయం స్వల్పంగా 5 శాతం పెరిగి రూ. 66,087 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు క్యూ4 ఫలితాల సమయంలో టీసీఎస్.. షేర్ హోల్డర్లకు స్పెషల్ డివిడెండ్ కూడా ప్రకటిస్తుందని భావిస్తున్నారు.