మార్కెట్లు పడుతున్నా దుమ్మురేపుతున్న ఓలా.. ఆల్ టైమ్ లో నుంచి 60 శాతం జంప్.. వారికి పండగే!

Wait 5 sec.

: స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సూచీలు కుదేలయ్యాయి. భారీ స్థాయిలో పతనమై ఇన్వెస్టర్లకు తీవ్ర నష్టాల్ని మిగిల్చాయి. మళ్లీ ఇటీవల ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం ముగింపుపై సంకేతాలతో సూచీలు వరుసగా పుంజుకుంటున్నాయి. కిందటి రోజు (ఏప్రిల్ 8) ఇంకా . సెన్సెక్స్ దాదాపు 3000 పాయింట్లు పుంజుకుంది. అయితే ఇవాళ్టికి మళ్లీ సీన్ రివర్స్ అయింది. ఇరాన్ చుట్టూనే అమెరికా బలగాలు ఇంకా ఉండటంతో.. హర్ముజ్ జలసంధి దగ్గర నౌకల రాకపోకలపై స్పష్టత లేకపోవడంతో.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సూచీలు పడిపోతున్నాయి. ఏప్రిల్ 9న ప్రస్తుతం వార్త రాసే సమయంలో (ఉదయం 11.30 గంటలకు) సెన్సెక్స్ 580 పాయింట్ల నష్టంతో 76,970 స్థాయిలో ఉంది. నిఫ్టీ 130 పాయింట్లు తగ్గి 23,860 స్థాయిలో కదలాడుతోంది. రిలయన్స్, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం ఇలా పలు హెవీ వెయిట్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో ఇలా జరుగుతోంది. అయితే ఇదిలా ఉన్నా.. మార్కెట్లు భారీగా పడిపోతున్నా.. ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ మేకర్ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు భారీగా పుంజుకున్నాయి. కిందటి రోజు రూ. 30.27 వద్ద ముగియగా ఇవాళ ఆరంభంలో స్వల్ప లాభాలతో మొదలవగా.. తర్వాత ఇంకా పుంజుకుంది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఏకంగా 17 శాతానికిపైగా పెరిగి రూ. 35.30 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం కూడా 15 శాతానికిపైగా లాభంతో రూ. 35 స్థాయిలో ఉంది. ఇక్కడ విశేషం.. ఏంటంటే ఇటీవల చారిత్రక కనిష్ఠాలకు పడిపోయాయి. 2026, మార్చి 16నే ఓలా షేర్లు రూ. 22.25 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని నమోదు చేశాయి. అక్కడి నుంచి భారీగా పెరగడం గమనార్హం. ఈ క్రమంలో నెల తిరగకముందే స్టాక్ ధర రికార్డు స్థాయిలో 60 శాతం వరకు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండింది. గత 5 ట్రేడింగ్ సెషన్లలోనే ఓలా షేరు రికార్డు స్థాయిలో 36 శాతం పెరిగింది. సంస్థ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 14.60 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 71.25 గా ఉంది. ఇది గతేడాది సెప్టెంబర్ 4న నమోదైంది. ఓలా షేర్లు కనిష్ఠాల నుంచి భారీగా పెరిగేందుకు ప్రధాన కారణం.. ఓలా విక్రయాలు పెరగడమే. ఇటీవల . ఇది ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచింది. ఇంకా సర్వీస్ సెంటర్లను విస్తరించడం సహా సర్వీసింగ్‌కు వచ్చిన రోజే దాదాపుగా 80 శాతం వరకు వాహనాల్ని అదే రోజు తిరిగి ఇస్తున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో . ఈ బైక్‌ను.. ప్రభుత్వం నుంచి రాయితీలు లభించే పీఎల్ఐ స్కీం కింద చేర్చడం కూడా సానుకూలంగా మారింది. ఈ కారణాలతో మళ్లీ ఓలా దశ తిరిగినట్లే కనిపిస్తోంది. గమనిక: పైన ఇచ్చింది సమాచారం మాత్రమే.. పెట్టుబడులకు సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.