: వ్యవసాయ రంగానికి చెందిన స్మాల్ క్యాప్ కేటగిరి కంపెనీ RM డ్రిప్ అండ్ స్ప్రింకిల్స్ సిస్టమ్స్ లిమిటెడ్ (RM Drip And Sprinklers Systems Limited) సూపర్ ఆఫర్ అందిస్తోంది. ఈ కంపెనీ బోర్డు డైరెక్టర్స్ ఇటీవలే తమ షేర్ హోల్డర్లకు 5:7 రేషియోలో బోనస్ షేర్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన రికార్డు డేట్ ఏప్రిల్ 10 గా నిర్ణయించారు. అంటీ ఈరోజు మార్కెట్లు ముగిసే లోపు ఈ కంపెనీలో షేర్లు కొన్నవారికి ఉచితంగా షేర్లు లభిస్తాయి. ప్రతి 7 షేర్లకు 5 షేర్ల చొప్పున ఎన్ని కొంటే అన్ని షేర్లు వస్తుంటాయి. మరోవైపు ఈ కంపెనీ షేర్ గత 5 ఏళ్లలో 2000 శాతం లాభాన్ని అందించింది. ఇక RM డ్రిప్ అండ్ స్ప్రింకిల్స్ సిస్టమ్స్ లిమిటెడ్ రూ. 50 లోపు ధర గల ఒక పెన్నీ స్టాక్.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. కొద్ది రోజుల క్రితం కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమై 5:7 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు. రికార్డు డేట్ నాటికి రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉన్న 7 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసి తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉన్నట్లయితే వారికి అదనంగా రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండే 5 ఈక్విటీ షేర్లను బోనస్ రూపంలో ఉచితంగా ఇస్తారు. ఈ బోనస్ షేర్లు పొందడానికి అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు డేట్ ఏప్రిల్ 10, 2026గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.క్రితం రోజు ముగిసే నాటికి RM డ్రిప్ అండే స్ప్రింకిల్స్ సిస్టమ్స్ షేరు 0.51 శాతం లాభంతో రూ. 47.58 వద్ద ముగిసింది. అయితే ఈరోజు మార్కెట్ ట్రేడింగ్‌లో నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో 5 శాతం మేర నష్టంతో రూ.45 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 123.80 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 35.79 వద్ద ఉంది. గత నెల రోజుల్లో 8 శాతం నష్టపోయింది. గత ఆరు నెలల్లో 35 శాతం పడిపోయింది. గత ఏడాది కాలంలో 7 శాతం మాత్రమే లాభం ఇచ్చింది. గత ఐదేళ్ల కాలంలో ఏకంగా 2068 శాతం లాభాన్ని అందించింది మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో నిలిచింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 1130 కోట్లుగా ఉంది.